సమంత కమ్ బ్యాక్ మూవీ ఇదే!

శాకుంతలం సినిమా తర్వాత సినిమాలు పక్కనపెట్టేసింది సమంత. మయొసైటిస్ సైడ్ ఎఫెక్టుల నుంచి కోలుకునేందుకు ఆమె కావాలనే గ్యాప్ తీసుకుంది. ఇప్పుడామె పూర్తిగా కోలుకుంది. దీంతో ఆమె కమ్ బ్యాక్ మూవీపై చాలా ఊహాగానాలు చెలరేగాయి. ఎట్టకేలకు వాటికి తెరపడింది.

తన పుట్టినరోజు సందర్భంగా కమ్ బ్యాక్ మూవీని ప్రకటించింది సమంత. ఆ మూవీకి బంగారం అనే టైటిల్ పెట్టింది. దీనికి సంబంధించి పోస్టర్ కూడా రిలీజైంది.

బంగారం పోస్టర్ లో వివాహితగా కనిపించింది సమంత. మెడలో మంగళసూత్రం, బ్యాక్ గ్రౌండ్ లో వంట గది, కుక్కర్ లాంటి సెటప్ కనిపించింది. అయితే సమంత చేతిలో మాత్రం తుపాకీ ఉంది. గన్ పట్టుకొని చాలా సీరియస్ గా చూస్తున్న స్టిల్ ను విడుదల చేశారు.

ఈ కమ్ బ్యాక్ మూవీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ సినిమాను తనే స్వయంగా నిర్మించబోతోంది. కొన్ని నెలల కిందట సమంత, ట్రాలాలా అనే బ్యానర్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతోంది. నిర్మాతగా సమంతకు ఇదే తొలి సినిమా.

రీఎంట్రీలో ఆమె స్టార్ హీరోతో సినిమాను ఎనౌన్స్ చేస్తుందని చాలామంది భావించారు. స్టార్ హీరో సరసన గ్లామరస్ రోల్ లో ఆమె కనిపించనుందంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే సమంత మాత్రం తన కమ్ బ్యాక్ మూవీకి బంగారం ప్రాజెక్టును ఎంచుకుంది. వచ్చే ఏడాది పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదలవుతుంది. 

Show comments

Related Stories :