భువనేశ్వరి యాత్రకు చంద్రబాబు జాకీలు!

చంద్రబాబునాయుడు జైల్లో ఉన్నారు. చినబాబు నారా లోకేష్ జైలు భయంతో, తన అరెస్టు నేడో రేపో అన్నట్టుగా తచ్చట్లాడుతూ తిరుగుతున్నారు. ఇకపోతే భువనేశ్వరి మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నారు. అందుకనే ఆయన తన తరఫు బ్రహ్మాస్త్రంగా ఆమెను ఏపీ మీదికి సంధిస్తున్నారు. 

భువనేశ్వరి చేపట్టబోతున్న ‘నిజం గెలవాలి’ యాత్ర- తమ పార్టీకి జాకీలు వేసి పైకి లేపుతుందని.. ఆశపడుతున్నారు. అలా జరగాలంటే.. ముందు భువనేశ్వరి యాత్ర సక్సెస్ కావాలి కదా. అందుకోసం చంద్రబాబునాయుడు .. ఆమె యాత్రను జాకీలు వేసి పైకి లేపడానికి, అది సక్సెస్ అయ్యేలా తన వంతు ప్రయత్నం చేయాలనుకుంటున్నారు.

అయితే ఆయన జైల్లో ఉన్నాడాయె.. తానంతగా జాకీలు వేసి లేపడం ఎలా సాధ్యమవుతుంది? అయితే ఇందుకు తెలుగుదేశం పార్టీ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. తెలుగు ప్రజలకు ఆయన రాసినట్టుగా ఒక లేఖను విడుదల చేసింది. ములాఖత్ సందర్భంగా.. తన అభిప్రాయాలు, ఆలోచనలు చెప్పి ప్రజలకు లేఖ రాయాల్సిందిగా చంద్రబాబు కోరారని వారు సెలవిచ్చారు. ‘నేను అందుబాటులో లేని కష్ట కాలంలో నా తరఫున ప్రజల్లోకి వెళ్లి పోరాడాలని కోరగా భువనేశ్వరి అంగీకరించారని, నా అక్రమ అరెస్టుతో తల్లడిల్లి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికరి ‘నిజం గెలవాలి’ యాత్ర చేస్తున్నారని..’ చంద్రబాబునాయుడు ఆ లేఖలో పేర్కొన్నారు.

సాధారణంగా రాజకీయ నాయకులు తమ పేర్లతో సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహిస్తుంటారు. ఇందులో రాసుకోవడానికి వారికి అసలు ఖాళీ దొరకదు. కానీ.. వారి పేరుతో ఆ ఖాతాలను మేనేజ్ చేసే బృందాలు వేరే ఉంటాయి. నాయకుడి బుద్ధిని, ఆలోచనను బట్టి వారే పోస్టులు రాసి పెట్టేస్తుంటారు. వాటిని సదరు నాయకులు చూసుకుంటారో లేదో కూడా డౌటే. అంటే ఘోస్ట్ వర్క్ నడుస్తూ ఉంటుందన్నమాట. చూడబోతే చంద్రబాబునాయుడు లేఖ కూడా అలాగే కనిపిస్తోంది. ఆయన మాకు చెప్పి మాతో రాయించాడు అని కుటుంబసభ్యులు సెలవిచ్చినప్పటికీ.. లేఖను సినిమాటిగ్గా వండారు. Readmore!

‘ఈ చీకట్లు తాత్కాలికం, సత్యం అనే సూర్యుడి ముందు కారుమబ్బులు విడిపోతాయి. సంకెళ్ల నా సంకల్పాన్ని బంధించలేవు. జైలుగోడలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు.. జైలు ఊచలు ప్రజల నుంచి దూరం చేయలేవు..’ అంటూ కవితాత్మకంగా ఆయన లేఖ సాగిపోయింది.

‘నేను జైలులో లేను. మీ అందరి గుండెల్లో ఉన్నాను’ అంటూ చంద్రబాబునాయుడు లేఖలో ఉన్న పంచ్ డైలాగులను గమనిస్తే.. జైలులో ఉన్న సంగతిని ఆయన పూర్తిగా మరచిపోయారేమోనని, ఇక బెయిలుకోసం అప్లయి చేసుకోవడం కూడా మానేస్తారేమోనని ఈ లేఖ చూసి పలువురు నవ్వుకుంటున్నారు.

Show comments

Related Stories :