జిన్నా ఓ అద్భుతం.. కానీ ఆడలేదు

మంచు విష్ణు హీరోగా నటించిన సినిమా జిన్నా. జి.నాగేశ్వర రెడ్డి కథ అందించగా, కోన వెంకట్ స్క్రిప్ట్ సమకూర్చిన ఈ సినిమాకు స్వయంగా మోహన్ బాబు స్క్రీన్ ప్లే రాశారు. సినిమాపై మంచు కుటుంబం మొత్తం భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే జిన్నా మూవీ ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది.

అట్టర్ ఫ్లాప్ అయిన జిన్నా సినిమా తనకు షాక్ ఇచ్చిందన్నారు మోహన్ బాబు. అన్ని కమర్షియల్ హంగులు అద్భుతంగా కుదిరిన ఆ సినిమా ఎందుకు ఫెయిలైందో తనకు ఇప్పటికీ అర్థం కావడంలేదన్నారాయన.

"జిన్నా ఎందుకు ఫెయిల్ అయిందో ఇవాళ్టికి కూడా నాకు అంతుబట్టడం లేదు. అదొక ఎక్స్ టార్డనరీ మూవీ. ఓటీటీలో అది పెద్ద హిట్. జిన్నా ఫెయిల్యూర్ కు చాలామంది చాలా కారణాలు చెప్పారు. నేనైతే అదృష్టాన్ని నమ్ముతాను. మాకు అదృష్టం దక్కలేదనుకుంటాను. విష్ణు కెరీర్ లో ఢీ, దూసుకెళ్తా లాంటి మంచి సినిమాలున్నాయి. వాటన్నింటికంటే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ జిన్నాలో ఉంది. కానీ అది ఆడలేదు."

ఇక తను నటించిన సన్నాఫ్ ఇండియా ఫెయిల్యూర్ ను కూడా అంగీకరించారు మోహన్ బాబు. ఆ సినిమాతో తను ఓ పెద్ద ప్రయోగం చేశానని, ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని 2 వందల రూపాయల టికెట్ పెట్టి ఎందుకు చూడాలని ప్రేక్షకులు భావించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

Show comments