దర్శన్ కేసు: హత్యను ఫోన్ లో రికార్డ్ చేశారంట?

తన వీరాభిమాని రేణుకా స్వామి హత్య కేసులో హీరో దర్శన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి రోజురోజుకు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా మరిన్ని విస్తుగొలిపే అంశాలు బయటకొచ్చాయి.

రేణుకాస్వామి మరణం తర్వాత ఆ హత్యను హార్ట్ ఎటాక్ గా చిత్రీకరించేందుకు దర్శన్ ప్రయత్నించాడట. పోస్టుమార్టం నివేదికను మార్చి, గుండెపోటుతో చనిపోయినట్టు రిపోర్ట్ ఇస్తే కోటి రూపాయలిస్తానని దర్శన్ ఆఫర్ చేశాడట. ఈ విషయాన్ని పోస్టుమార్టం చేసిన వైద్యాధికారుల్లో ఒకరు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.

మరణించిన రేణుకాస్వామి పోస్టుమార్టంలో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. అతడి శరీరంపై 15 తీవ్రమైన గాయాల్ని వైద్యులు గుర్తించారు. వీటిలో 4 గాయాల వల్ల అతడి ఎముకలు విరిగాయి. అంతేకాదు, ఒక దశలో షెడ్టులోని ఓ ట్రక్కుకు రేణుకాస్వామి తలను మోదినట్టు పోస్టుమార్టం నివేదికలో ఉంది.

మొత్తం వీడియో తీశారంట.. రేణుకాస్వామిని దర్శన్ తన బెల్టుతో కొట్టినట్టు ఇన్నాళ్లూ బయటకొచ్చింది. కానీ అతడ్ని బూటు కాలితో దారుణంగా తన్నినట్టు అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఒకరు బయటపెట్టారు. ఇదంతా ఒకెత్తయితే, మరో దారుణమైన విషయం కూడా వెలుగులోకొచ్చింది. Readmore!

రేణుకాస్వామిని తీవ్రంగా గాయపరిచే సమయంలో ఆ తతంగం మొత్తాన్ని దర్శన్ కు చెందిన ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేసినట్టు అరెస్ట్ అయిన 14 మంది నిందితుల్లో ఒకడు బయటపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట.

పోలీసుల విచారణలో దర్శన్, పవిత్ర నోరు విప్పడం లేదు. ఈ వీడియో దొరికితే మాత్రం దర్శన్ పనైపోయినట్టే. మరోవైపు పరారైన మరో ముగ్గురు ఆచూకీని పోలీసులు కనుగొన్నట్టు చెబుతున్నారు. ఆ ముగ్గురిలో ఒకరి దగ్గర వీడియో ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Show comments

Related Stories :