రాజమౌళి కి నాగ్ అశ్విన్ కు అదే తేడా

కల్కి సినిమా రికార్డులు బ్రేక్ చేసే దిశగా సాగుతోంది. ఆర్ఆర్ఆర్ ను మించిన ఓపెనింగ్ తీసుకువస్తుంది అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. రాజమౌళి పేరు లేకుండా పాన్ ఇండియా హీరో అయ్యాడు బన్నీ. రాజమౌళి అండ లేకుండానే రికార్డులు షేక్ అవుతున్నాయి కల్కి సినిమాతో. ఈ విషయాల్లో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళికి దీటుగా ఓ ఊహా ప్రపంచాన్ని సృష్టించి, జనాల్ని ఓ మాయాలోకంలోకి తీసుకెళ్లడంలో నాగ్ అశ్విన్ స్టామినాను తక్కువ అంచనా వేయక్కరలేదు.

కానీ సినిమాకు హైప్ తీసుకురావడంలో, సినిమాను మార్కెట్ చేయడంలో మాత్రం రాజమౌళిని కొట్టే దర్శకుడు ఇంకా రాలేదేమో? సినిమాను ప్లాన్ చేయడం, సైలంట్ గా అంతా రెడీ చేసుకుని, సినిమా ప్రారంభంలో ఒక్కసారి మీడియాను కలిసి మొత్తం వివరించి పనిలోకి వెళ్లిపోవడం, మెలమెల్లగా అప్ డేట్ లు ఇచ్చుకుంటూ రావడం, సినిమా విడుదలకు ముందు చాలా ప్లాన్డ్ గా ఇంటర్వ్యూలు, ప్రమోషన్ కంటెంట్ ఇలా ఒకటి కాదు. సినిమాకు సమాంతరంగా అంతా జరుగుతూ వుంటుంది.

దేశం అంతా తిరగడం, ముఖ్యంగా హీరోలను పబ్లిసిటీలో ఇన్వాల్వ్ చేయడం, సినిమా విడుదల నాటికి అటు కాపీని రెడీ చేయడం, ఇటు సినిమాకు సరైన పబ్లిసిటీ చేసి హైప్ తేవడం చాలా స్మూత్ గా సమాంతరంగా జరిగిపోతుంది.

కానీ నాగ్ అశ్విన్ కు ఈ రెండో విద్య పట్టుబడినట్లు లేదు. కాపీని రెడీ చేయడంతోనే కిందా మీదా పడుతున్నారు. విడుదలకు మూడు రోజులు ముందు వరకు కంటెంట్ పని మీదే వున్నారు. హీరో కానీ, మిగిలిన వారు కానీ ఇప్పటి వరకు తెలుగు మీడియా ముందుకు రాలేదు. ఒక ముంబాయి ప్రెస్ మీట్ తో సరిపెట్టారు. ప్రభాస్ ఇక్కడే వున్నారో, ఎప్పటి మాదిరిగా యూరప్ లో వున్నారో తెలియదు. మ్యూజిక్ డైరక్టర్ ఇంకా లాస్ట్ మినిట్ పనుల్లోనే వున్నారు. Readmore!

బహుశా రాజమౌళికి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా తలో పని భుజాన వేసుకుని ముందుకు వెళ్లిపోతారు. ఇక్కడ నాగ్ అశ్విన్ కు కేవలం స్వప్న దత్ మాత్రమే సపోర్ట్. ఆమె మార్కెటింగ్, మిగిలిన ప్లానింగ్ చూసుకుంటారు. కాపీ, దాని క్వాలిటీ ఇంకా మిగిలినవి అన్నీ మాత్రం నాగ్ అశ్విన్ నే చూసుకోవాలి. అదే తేడా కావచ్చు.

Show comments

Related Stories :