సలార్-2 కంటే ముందు కన్నప్ప

ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. అతడు ఏ రోజు ఏ సినిమా సెట్స్ లో ఉంటాడో చెప్పడం కూడా కష్టమే. ఇలాంటి టైమ్ లో సలార్-2 బాగా సౌండ్ చేస్తోంది. ఏ క్షణానైనా ప్రభాస్, ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అవుతాడంటూ కథనాలు వస్తున్నాయి.

ఓవైపు సలార్-2పై ఇలా కథనాలు నడుస్తుండగానే.. కన్నప్ప సెట్స్ లో జాయిన్ అయ్యాడు ప్రభాస్. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడానికి ప్రభాస్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేశాడు.

అయితే ఇది ఎక్కువ రోజులు నడిచే షూటింగ్ కాదు. తాజా సమాచారం ప్రకారం, 10 రోజుల కాల్షీట్లతో కన్నప్పను పూర్తి చేయబోతున్నాడు ప్రభాస్. అందుకే సలార్-2 సెట్స్ పైకి వెళ్లేముందు, దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా షూట్ స్టార్ట్ చేశాడు.

ప్రభాస్ తన సినిమా సెట్స్ లోకి వచ్చినట్టు స్వయంగా మంచు విష్ణు ప్రకటించాడు. ఇప్పటికే అక్షయ్ కుమార్ తో ఓ షెడ్యూల్ పూర్తిచేసిన ఈ నటుడు, ఇప్పుడు ప్రభాస్ కాంబినేషన్ లో మరికొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నాడు.

Readmore!

నిజానికి భక్త కన్నప్ప సినిమా ప్రభాస్ చేయాల్సిన ప్రాజెక్టు. ప్రభాస్ హీరోగా స్వీయ దర్శకత్వంలో భక్త కన్నప్ప సినిమాను నిర్మించాలనుకున్నారు కృష్ణంరాజు. ఆ కోరిక తీరకుండానే ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్లారు. ఇప్పుడు మంచు విష్ణు తీస్తున్న కన్నప్పలో ప్రభాస్ నటిస్తుండడంతో, పెదనాన్న కోరికను కొంతైనా తీర్చినట్టవుతుంది.

Show comments

Related Stories :