సల్మాన్-రష్మిక.. ఏజ్ గ్యాప్ పై హాట్ హాట్ చర్చ

తెలుగులో బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోలకు హీరోయిన్లు దొరకడం యమ కష్టంగా మారింది. నయనతార లాంటి హీరోయిన్లు చుక్కలు చూపించిన తర్వాత ఈ హీరోలకు మరింత ఇబ్బందిరకమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రతి సినిమాకు నెట్టుకొస్తున్నారు. అయితే బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ కు ఈ సమస్య లేదు. అతడు ఏజ్ గ్యాప్ ను అస్సలు పట్టించుకోడు. హీరోయిన్ తనకంటే ఎంత చిన్నదైనా, ఆమెతో రొమాన్స్ చేస్తాడు, స్క్రీన్ పంచుకుంటాడు. కామెంట్స్ ను అస్సలు పట్టించుకోడు.

ఇప్పుడిదంతా ఎందుకంటే, తాజాగా తన కొత్త సినిమా కోసం రష్మికను హీరోయిన్ గా తీసుకున్నాడు సల్మాన్. మురగదాస్ దర్శకత్వంలో రాబోతున్న సికిందర్ సినిమాలో రష్మికతో రొమాన్స్ చేయబోతున్నాడు. వీళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అక్షరాలా 30 సంవత్సరాలు. తనకంటే 30 ఏళ్ల చిన్నదైన హీరోయిన్ తో సల్మాన్ ఆడిపాడబోతున్నాడన్నమాట. పైపెచ్చు రొమాన్స్ కూడా.

అయితే సల్మాన్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. తనకంటే చాలా చిన్నదైన సయీ మంజ్రేకర్ తో కూడా అతడు నటించాడు. దబాంగ్ 3 టైమ్ కు సల్మాన్-సయీ మధ్య వయసు అంతరం ఏకంగా 33 ఏళ్లు.

రీసెంట్ గా పూజా హెగ్డేతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు సల్మాన్. కిసీకో భాయ్ కిసీకి జాన్ సినిమా టైమ్ కి సల్మాన్-పూజా మధ్య ఏజ్ గ్యాప్ అక్షరాలా పాతికేళ్లు. అంతకంటే ముందు అనుష్క శర్మతో నటించాడు. వాళ్లిద్దరి మధ్య వయసు తేడా 23 ఏళ్లు.

Readmore!

చివరికి దిశాపటానీని కూడా వదల్లేదు. ఆమెతో కూడా నటించాడు. రాధే సినిమాలో సల్మాన్ సరసన నటించే టైమ్ కు దిశా పటానీ వయసు జస్ట్ 28 ఏళ్లు. వాళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 27 సంవత్సరాలు. ఒక దశలో ఈ ఏజ్ గ్యాప్ పై దిశా స్పందించింది కూడా. ఇకపై ఏజ్ బార్ హీరోలతో సినిమాలు చేయనని ప్రకటించింది.

దబంగ్ ఫ్రాంచైజీ చేసే టైమ్ కి సల్మాన్-సోనాక్షి మధ్య వయసు తేడా 22 ఏళ్లు. అయితే తన ఫిజిక్ కారణంగా, అప్పట్లో సల్మాన్ సరసన సరిగ్గా సరిపోయింది సోనాక్షి. ఇలా తనకంటే వయసులో చాలా చిన్నవాళ్లతో నటించడం సల్మాన్ కు అలవాటైపోయింది. ఫ్యాన్స్ కు కూడా అదే నచ్చింది. ఇప్పుడీ లిస్ట్ లోకి రష్మిక చేరింది.

Show comments

Related Stories :