రేపు పోలీసుల విచారణకు తమన్నా

ఊహించని విధంగా హీరోయిన్ తమన్నాకు మహారాష్ట్ర సైబర్ సెల్ నుంచి నోటీసులందిన సంగతి తెలిసిందే. 29వ తేదీన, అంటే రేపు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. తాజా సమాచారం ప్రకారం రేపు మహారాష్ట్ర పోలీసుల విచారణకు తమన్నా హాజరవుతోంది.

బాక్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది తమన్న. మరోవైపు ఆమె నటిస్తున్న ఓదెల-2 కూడా సెట్స్ పై ఉంటుంది. ఈరోజు ఆమె టాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలిచ్చింది. రేపు పోలీసుల విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. దీనిపై తన లాయర్లతో ఆమె చర్చలు జరిపింది.

గతేడాది ఐపీఎల్ ప్రసారాలకు సంబంధించిన కేసు ఇది. ఐపీఎల్-2023 మ్యాచుల్ని చట్ట వ్యతిరేకంగా ఫెయిర్ ప్లే అనే యాప్ లో స్ట్రీమింగ్ చేశారు. దీని వల్ల తమకు కోట్ల రూపాయల్లో నష్టం వచ్చిందని ఆరోపిస్తోంది వయాకమ్ సంస్థ. ఈ మేరకు ఫైల్ అయిన కేసులో సాక్ష్యాధారాల కోసం రావాల్సిందిగా తమన్నాకు నోటీసులిచ్చారు. ఎందుకంటే, అప్పట్లో ఆ యాప్ కు ప్రచారకర్తగా పనిచేసింది తమన్నా. మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వహకులకు చెందిన యాప్ ఇది.

తమన్నా కంటే ముందు చాలామంది నటీనటుల్ని పోలీసు విచారించారు. గతేడాది అక్టోబర్ లో మహాదేవ్ స్కామ్ పై శ్రద్ధా కపూర్ ను విచారించింది ఈడీ. అదే టైమ్ లో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ వాంగ్మూలం కూడా తీసుకుంది. కపిల్ శర్మ, సాహిల్ ఖాన్, హుమా ఖురేషీ, హీనా ఖాన్ లను కూడా విచారించింది. వీళ్లలో సాహిల్ ఖాన్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

Show comments

Related Stories :