బాక్ అంటే ఏంటో తెలిసిపోయింది

సూపర్ హిట్ హారర్ ఫ్రాంచైజీ అరణ్మయి నుంచి వస్తున్న నాలుగో సినిమా బాక్. స్వీయ దర్శకత్వంలో సుందర్ సి నటించిన ఈ సినిమాకు బాక్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఈరోజు రిలీజ్ చేసిన ట్రయిలర్ తో దానికి ఓ జస్టిఫికేషన్ ఇచ్చారు. బాక్ అనేది దెయ్యం పేరు.

సినిమాలో సుందర్ సి, తమన్న అన్నాచెల్లెళ్లుగా కనిపించారు. తమన్న, ఆమె భర్త మరణాల వెనక కారణాల్ని తెలుసుకోవాలనుకుంటాడు సుందర్ సి. సహజంగా లాయర్ కూడా అయిన సుందర్, ఈ కేసును ఎలా ఛేదించాడు అనేది ఈ సినిమా కథ.

తన సోదరి మరణం వెనక ఏదో కుట్ర ఉందని అనుమానించిన సుందర్, అతీంద్రియ శక్తుల చొరవ కూడా ఉందని తెలుసుకుంటాడు. అక్కడ్నుంచి కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది ఈ సినిమా.

ట్రయిలర్ తో తమన్న, సుందర్ పాత్రలపై క్లారిటీ ఇచ్చేశారు. ఇక దెయ్యం ఉన్న ఇంట్లో అద్దెకు దిగిన పాత్రలో రాశిఖన్నాను చూపించారు. ట్రయిలర్ ప్రకారం చూస్తుంటే, రాశిఖన్నా కంటే తమన్నాకు మంచి క్యారెక్టర్ దక్కినట్టు కనిపిస్తోంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. మే 3న థియేటర్లలోకి వస్తోంది. ఏషియన్ సురేష్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది.

Show comments

Related Stories :