ఉళ్లో పెళ్లికి కుక్కల హడావుడి.. అనే చమత్కారపు సామెతను ఉదాహరించవచ్చు తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం చేస్తున్న హడావుడి చూస్తే! తెలంగాణ వేదికగా ఆవిర్భవించిన ఈ పార్టీ అక్కడ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు!
కనీసం కాంగ్రెస్ కు మద్దతు అని ప్రకటించలేదు! మరోవైపు తెలుగుదేశం పార్టీకి బాగా పట్టున్న నియోకవర్గాలు అని పేరున్న శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్ ఏరియాల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగరేసింది! ఇక్కడ 2014లో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గెలిచిన గాంధీ, మాగంటిగోపినాథ్ లు ఆ తర్వాత టీఆర్ఎస్ లోకి చేరి కొనసాగుతూ ఉన్నారు, ఈ ఎన్నికల్లో కూడా వారు బీఆర్ఎస్ తరఫున నెగ్గారు!
మరి అధికారికంగా మద్దతూ ప్రకటించక, పాత తెలుగుదేశం నేతలు బీఆర్ఎస్ తరఫున నెగ్గాకా.. కాంగ్రెస్ విజయోత్సవాల్లో జెండాలు ఊపడం తెలుగుదేశం పార్టీ పతానావస్థకు పరాకాష్ట! ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం తీరు ఉంది!
ఇక చంద్రబాబు వీరాభిమానులు అయితే.. కేసీఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడట! రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ను గెలిపించాడని కూడా చెప్పుకుంటున్నారు! మరి వాళ్లనూ వీళ్లను ఎందుకు.. తన పార్టీని చంద్రబాబు ఏపీలో ఎందుకు గెలిపించుకోలేకపోతున్నాడో, ఆయన తనయుడు, దత్తపుత్రుడు ఎందుకు కనీసం ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలు కాలేదో మరి! కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబును పొగడాలి, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబే కారణం! ఇదీ పచ్చపార్టీ దురావస్థ!