తెలుగులోకి కేజిఎఫ్ ఆర్ట్ డైరక్టర్

కేజిఎఫ్ సిరీస్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది. మ్యూజిక్ డైరక్టర్ రవిబసూర్ కి చాలా చాన్స్ లు వచ్చాయి. డైరక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరక్టర్ అయిపోయారు. ఇప్పుడు అదే సినిమా ఆర్ట్ డైరక్టర్ కూడా తెలుగులోకి వచ్చేసారు. 

కేజిఎఫ్ సిరీస్ కు పనిచేసిన శివకుమార్ ను తెలుగు లో విజ‌య్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కు తీసుకున్నారు. ఈ సినిమా థీమ్, యాక్షన్ సెట్ లు అన్నీ కాస్త హెవీగా, డిఫరెంట్ గా వుంటుంది. దానికి శివకుమార్ అయితే పెర్ ఫెక్ట్ గా వుంటుందని భావించడంతో ఆయనను తీసుకున్నారు. 

ఈ సినిమా త్వరలో సెట్ మీదకు వెళ్తుంది. విజ‌య్ దేవరకొండ ప్రస్తుతం ఖుషీ సినిమాను పూర్తి చేసే పనిలో వున్నారు. ఇంకో రెండు మూడు వారాలు ఈ సినిమా వర్క్ వుంటుంది. అది పూర్తయిన తరువాత ఈ సినిమా మీదకు వస్తారు. మధ్యలో మళ్లీ విడుదల టైమ్ లో కాస్త గ్యాప్ తీసుకుంటారు. ఖుషీ సినిమా ఆగస్ట్ లో విడుదలయ్యే అవకాశం వుంది.

జెర్సీ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి మళ్లీ అదే బ్యానర్ లో చేస్తున్న సినిమా ఇది. కాస్త మంచి పారితోషికం అందుకుంటున్నారు ఈ సినిమాకు గౌతమ్. ఈ సినిమాకు సంగీతం జివి ప్రకాష్ కుమార్ నా? అనిరుధ్ నా అన్నది ఇంకా డిసైడ్ కాలేదు.

Show comments