మెగాస్టార్-దానయ్య-కథ కావాలి!

సైరా..ఆచార్య..గాడ్ ఫాదర్..వాల్తేర్ వీరయ్య సినిమాల తరువాత మెగాస్టార్ చిరంజీవికి ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లుంది. జ‌నాలను ఎంటర్ టైన్ చేయాలి తప్ప, మెగా ఇమేజ్ దాటి ప్రయోగాలు చేస్తే నడవదని తెలిసి వచ్చినట్లుంది. ఆ సంగతి ఎలా వున్నా, వాల్తేర్ వీరయ్య విడుదలకు ముందు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. వాల్తేర్ వీరయ్య రిజ‌ల్ట్ చూసిన తరువాత కానీ ఏ విషయం డిసైడ్ చేసుకోకూడదు అనే ఆలోచనలో వుండిపోయారేమో?

ఇప్పుడు టైమ్ వచ్చింది. టైమ్ బాగుంది. అందుకే కొత్త సినిమాల మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరు మాస్ డైరక్టర్లతో చాలా కాలంగా టచ్ లో వున్నారు. వారు చెప్పిన ఐడియాలు విని వున్నారు. కానీ ఏదీ కాంక్రీట్ గా ఒకె కాలేదు. సరైన కథ దొరికే వరకు ఓకె అనే ఆలోచన అయితే లేదు. అలా ఓకె అయితే ఫస్ట్ సినిమా డివివి దానయ్యకు చేస్తారు. కథ తెచ్చుకుంటే ఎన్వీ ప్రసాద్ కు ఓ సినిమా వుంటుంది.

చిరు తో సినిమా అంటే కనీసం 150 కోట్లు ఖర్చు చేయాల్సి వుంటుంది. మెగాస్టార్ కు, మిగిలిన కాస్టింగ్, టెక్నీషియన్లకు కలిపి రెమ్యూనిరేషన్లే 70 కోట్ల వరకు అయిపోతుంది. సినిమా ప్రొడక్షన్ కు మరో అరవై, డెభై కోట్లు కావాలి. అంత రేంజ్ సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు, బ్యానర్లు తెలుగులో తక్కువే వున్నాయి. 

మెగాస్టార్ కు సన్నిహితులైన దానయ్య, ఎన్వీ ప్రసాద్ లాంటి నిర్మాతలు కొద్ది మంది లైన్ లో వున్నారు. మరో ఒకటి రెండు బ్యానర్లు కూడా ఈ జాబితాకు యాడ్ అయ్యే అవకాశం వుంది.

Show comments