టాలీవుడ్ లో ఫుల్ పేకాట

మామూలుగానే ఏమాత్రం ఖాళీ వున్నా బాలీవుడ్ జ‌నాలు పేకాట లో మునిగిపోతారు. అలాంటిది మూడు రోజులు సంక్రాంతి సెలవులు వచ్చాయి అంటే మరేమన్నా వుందా? విడుదలకు కిందా మీదా అయిపోతూ, నాన్ స్టాప్ గా ప్రొడక్షన్ వర్క్ నో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నో చేస్తున్న సినిమాలు పెద్దగా లేవు. అందుకే చాలా చోట్ల పేకాట లు షురూ అయ్యాయి.

కొంత మంది నిర్మాతలు ఆంధ్ర బాట పట్టారు. మిగిలిన వాళ్లు ఇక్కడి స్టార్ హొటళ్లను ఆశ్రయించారు. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ లో ని స్టార్ హోటళ్లు చాలా మంది పేకాటకు ఆశ్రయమిచ్చాయి. ఈ పేకాటలో హీరోలు కూర్చోవడం అన్నది అరుదుగా వుంటుంది. ఎందుకంటే వాళ్లు నిర్మాతలతో కన్నా, సన్నిహితులతో ఎక్కువ కూర్చుంటారు.

ఇటీవలే విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఓ టాప్ హీరో తన సన్నిహితుడైన భారీ బ్యానర్ నిర్మాత ఇంట్లో సిటింగ్ వేసినట్లు తెలుస్తోంది. ఇటు మందు అటు పేకాటతో ఈ సమావేశం లేట్ నైట్ వరకు జోరుగా సాగినట్లు తెలుస్తోంది. ఈ హీరో విదేశాలకు వెళ్లినపుడు సదరు నిర్మాత ఇంట్లోనే కొన్నాళ్లు వున్నట్లు తెలుస్తోంది.

మొత్తం మీద పండగ మైకం నుంచి టాలీవుడ్ బయటపడడానికి ఒకటి రెండు రోజులు పడుతుంది.

Show comments