పవన్‌ హీరోయిన్‌.. వైజ్‌ డెసిషన్‌

'నేను శైలజ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బొద్దుగుమ్మ కీర్తి సురేష్‌, ఆ తర్వాతి సినిమా 'నేను లోకల్‌'లోనూ బొద్దుగానే కన్పించింది.

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా కోసం ఇంకాస్త బొద్దుగా మారనుందంటూ గత కొంతకాలంగా కీర్తి సురేష్‌పై గాసిప్స్‌ విన్పిస్తోన్న విషయం విదితమే. అయితే, ఈ గాసిప్స్‌ని ఖండించింది. పైగా, ఇంకాస్త సన్నబడేందుకు కసరత్తులు చేస్తున్నానని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్‌. 

నిజంగానే కీర్తి సురేష్‌ కాస్త సన్నబడితే, ఆమె కెరీర్‌కి అది చాలా ఉపకరిస్తుంది. ఎందుకంటే, త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కోసం పవన్‌కళ్యాణ్‌ బాగా సన్నబడ్డాడు. అంతలా సన్నబడ్డ పవన్‌ పక్కన, కీర్తి మెరుపు తీగలా కన్పిస్తే, అంతకన్నా కావాల్సిందేముంది.? అది ఆమెకు ముందు ముందు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడ్తుంది.

హీరోయిన్లకి 'బొద్దుతనం' పెద్ద సమస్యగా మారిపోతోంది ఇటీవలి కాలంలో. అనుష్కనే తీసుకుంటే, 'సైజ్‌ జీరో' కోసం బాగా లావెక్కిన అనుష్క, ఆ తర్వాత సన్నబడేందుకు నానా తంటాలూ పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమె పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.  Readmore!

కీర్తి సురేష్‌ అయినాసరే, 'మహానటి' సినిమా కోసమంటూ లావెక్కితే, తిరిగి సన్నబడటం అంత తేలిక కానే కాదు. 'అయినా సినిమా కోసం సన్నబడటం ఓకేగానీ, లావెక్కడం అస్సలు సబబు కాదు..' అంటూ ఓ ప్రశ్నకు బదులిచ్చింది కీర్తి సురేష్‌. 

Show comments