నిజం: సర్జికల్ స్ట్రైక్స్ ను సమీక్షించిన చంద్రన్న!

అవును.. ఇది నిజం. నవ్వుకోకుండా.. నమ్మాల్సిందే! ఎందుకంటే.. నవ్వుకొంటారనే భయం రాసిన వాళ్లకు, దీన్ని ప్రచారం చేస్తున్న వాళ్లకు లేదు కాబట్టి. కాశ్మీర్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో పర్యవేక్షించాడట తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ రాష్ట్ర గవర్నర్ తో మాట్లాడి.. అక్కడ పరిస్థితులు సవ్యంగా ఉన్నాయా? అని తెలుసుకోవడంతో పాటు, సర్జికల్ స్ట్రైక్స్ ను కూడా సమీక్షించాడట చంద్రబాబు. ఆ వివరాల గురించి ఆ రాష్ట్ర గవర్నర్ వద్ద వాకబు చేశాడట!

ఈ విషయం ఎవరికీ తెలియదు కానీ.. తెలుగుదేశం అనుకూల పత్రిక ఒక దానికి మాత్రం తెలిసింది. ఈ పరమ కామెడీ ఎపిసోడ్ ను ఆ రెండు పత్రికల్లో ఒకటి మాత్రమే వాడుకుంది. 

అక్కడికీ వైకాపా అనుకూల నెటిజన్లు ముందే.. అన్నారు. చూడండి..ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఘనత కూడా నాదే అని బాబు చెప్పుకొంటాడు అని. ఇలా చేయాలని.. ఇలా చేస్తే బాగుంటుందని.. మోడీకి సలహా ఇచ్చాననో, సైన్యానికి దిశా నిర్దేశం చేశాననో బాబు చెప్పుకొంటాడు అంటూ వీళ్లు  ముందే అంటూ వచ్చారు.

బహుశా రేపో మాపో అదీ జరగొచ్చునేమో కానీ, అందరికీ నచ్చిన ఈ సర్జికల్ స్ట్రైక్స్ నా ఘనతే అని బాబు చెప్పుకున్నా అడ్డుకునే నాథుడు ఎవరూ లేరు. ప్రస్తుతానికి అయితే.. కాశ్మీర్ లో పరిస్థితుల గురించి బాబు సమీక్షించాడు. గవర్నర్ తో నివేదిక తీసుకున్నాడు. ఇంతకీ ఏ హోదాలో? అంటారా? ఏదైనా అనుకోవచ్చు. 

ఈ దేశంలో అత్యంత తెలివైన వ్యక్తి హోదాలో కావొచ్చు. భారతదేశానికి ఐటీని పరిచయం చేసిన హోదాలో కావొచ్చు. బాబుగారు తన గురించి తాను చెప్పుకొంటూ ఉంటారే… అదీ, ఇదీ అని.. ఆ సవాలక్ష హోదాల్లో దేంతో అయినా బాబుగారు కాశ్మీర్ లో పరిస్థితుల గురించి సమీక్షించి ఉండవచ్చు. సర్జికల్ స్ట్రైక్స్ వివరాలు తెప్పించుకుని ఉండవచ్చు! నమ్మాలంతే! 

Show comments