రేష్మీ..పబ్లిసిటీ ప్లీజ్..?

బుల్లితెర మీద కుర్రకారు అట్రాక్షన్ అంటే రేష్మీ నే. జబర్దస్త్ గా ఏంకరింగ్ చేసేసి, మెల్లగా బిగ్ స్క్రీన్ మీదకు వచ్చేసింది. వరుసగా సినిమాలు చేస్తోంది. ఈవారం ఆమె నటించిన అంతం విడుదల అయింది. మరో సినిమా విడుదలకు వుండనే వుంది. ఈ వారం విడుదలైన అంతం సినిమా రేష్మీ చేయడం వరకు ఓకె. కానీ ప్రచారానికి మాత్రం రాలేదట. 

సినిమా నిర్మాతలకు, రేష్మీకి వచ్చిన చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ నే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అంతం సినిమా ఇప్పుడు విడుదల చేయవద్దని, తను నటిస్తున్న మరో సినిమా..'తను వచ్చెనంట' తరువాత విడుదల చేసుకోమనీ రేష్మి కోరినట్లు తెలుస్తోంది. కానీ అంతం నిర్మాతలు, తమకు వున్న సమస్యల కారణంగా ఇప్పుడే విడుదల చేసారట. 

దాంతో రేష్మీ ప్రచారానికి రాని భీష్మించుకు కూర్చున్నట్లు వినికిడి. దాంతో ఏమాత్రం హడావుడి, ప్రచారం లేకుండానే ఈవారం అంతం విడుదలయిపోయింది.

Show comments