నాని స్పీడేంటండీ బాబూ?

ఇలా నేను లోకల్ విడుదలయింది. ఇంకా థియేటర్లలోనే వుంది. అప్పుడు మరో సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. అది కాక ఇంకో సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. హీరో నాని ప్లానింగ్, స్పీడ్ ఇదీ. డివివి దానయ్య తో కలిసి చేస్తున్న 'నిన్ను కోరి' ఫస్ట్ లుక్ ను మహా శివరాత్రి సందర్భంగా విడుదలచేసారు.

అదే సమయంలో మరో సినిమా ప్రకటన కూడా చేసేసారు. హను రాఘవపూడి డైరక్షన్ లో ఈ సినిమా వుంటుంది. అంటే మరో రెండు మూడు నెలల్లో నిన్ను కోరి విడుదలకు రెడీ అవుతుంది. ఆ నాటికి హను రాఘవపూడి సినిమా స్టార్ట్ చేసేయచ్చన్నమాట.

ఇంకోపక్క దిల్ రాజు మరో సినిమాను నానితో చేయాలని ప్లానింగ్ లో వున్నారు. ఈ లెక్కడ పక్కాగా జరిగిపోతే 2017లో నాని సినిమాలు మూడు విడుదలయ్యే అవకాశం వుంది. యంగ్ హీరోలు ప్లానింగ్ తో వున్నారు కానీ,  ఎవ్వరూ ఇంత స్పీడుతో లేరు. 

Readmore!
Show comments