పిక్‌ టాక్‌: లిప్‌ 'ఎటాక్‌'.!

'హార్ట్‌ ఎటాక్‌' సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఆదా శర్మ గుర్తుందా.? అదేనండీ, 'క్షణం', 'గరం', ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి సినిమాల్లో నటించింది కదా.! ఆ బ్యూటీనే ఇప్పుడు బాలీవుడ్‌లో 'కమెండో-2' సినిమాలో నటించేసింది. ఆ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమాపై ఆదా శర్మ చాలా ఆశలే పెట్టుకుంది. యాక్షన్‌ బేస్డ్‌ సినిమా కావడంతో, చాలా చాలా కష్టపడి యాక్షన్‌ సీన్స్‌ కూడా చేసేసింది. 

అన్నట్టు, 'కమెండో-2' సినిమాలో హీరోగా నటించింది ఎవరో కాదు, 'తుపాకీ' సినిమాలో విలన్‌గా నటించాడు కదా.. అతనే. పేరు, విద్యుత్‌ జమ్‌వాల్‌. సినిమాలో యాక్షన్‌ ఓ ఎత్తు.. రొమాన్స్‌ ఇంకో ఎత్తు. విద్యుత్‌ జమ్‌వాల్‌, ఆదా శర్మతో గాఢంగా ఓ 'లిప్‌ లాక్‌' లాగించేశాడు. ఈ సినిమాలో మరో హాట్‌ బ్యూటీ ఇషా గుప్తా కూడా నటించిందండోయ్‌.! 

'సినిమా అన్నాక అన్నీ వుండాలి.. అయినా లిప్‌ లాక్‌లో వింతేముంది.. అది చాలా సాధారణమైపోయిందిప్పుడు..' అంటూ విద్యుత్‌ జమ్‌వాల్‌తో తన లిప్‌ 'ఎటాక్‌' గురించి 'హార్ట్‌ ఎటాక్‌' బ్యూటీ చాలా తేలిగ్గా చెప్పేసింది. లిప్‌ లాక్‌లు, బీభత్సమైన యాక్షన్‌ ఎపిసోడ్‌లు ఇవన్నీ ఆదా శర్మకి సూపర్‌ హిట్‌ ఇస్తాయా.? వేచి చూడాల్సిందే.

Show comments