టెన్షన్ లో నందమూరి ఫ్యాన్స్

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విడుదల టైమ్ లో బాలకృష్ణ చేసిన ఓ ప్రకటన చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇక నుంచి తను చేసే ప్రతి సినిమా కొత్తగా ఉంటుందని, కచ్చితంగా కొత్త బాలకృష్ణను చూస్తారని ప్రకటించారు. ఇందులో భాగంగా పూరిజగన్నాధ్ తో సినిమా అనగానే ఫ్యాన్స్ అంతా హ్యాపీ ఫీలయ్యారు. ఎందుకంటే, పూరి సినిమాల్లో హీరో కచ్చితంగా డిఫరెంట్ గా కనిపిస్తాడు. హీరోలకు సరికొత్త మేనరిజమ్ ఆపాదిస్తాడు పూరి. 

కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే వరుసగా ఫ్లాపులే డెలివర్ చేస్తున్నాడు పూరీ. అందుకే బాలయ్యతో పూరిజగన్నాధ్ సినిమా స్టార్ట్ చేసినప్పట్నుంచి నందమూరి ఫ్యాన్స్ టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఎలాంటి అవుట్ పుట్ ఇస్తాడో అని భయపడుతూనే ఉన్నారు. దీనికి తోడు తాజాగా వచ్చిన రోగ్ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో బాలయ్య అభిమానుల్లో భయం రెట్టింపయింది.  

అయితే మనసులో ఎన్ని భయాలున్నప్పటికీ ఏదో మూల చిన్న ఆశ మాత్రం ఫ్యాన్స్ లో ఉంది. ఎందుకంటే, పూరి ఎన్ని ఫ్లాపులిచ్చినా మధ్యమధ్యలో టెంపర్ లాంటి చమక్కులు అందిస్తూనే ఉన్నాడు. సో.. ఈసారి బాలయ్య సినిమా కూడా సూపర్ హిట్ అయి, పూరి  ఫ్లాపుల మధ్య ధృవతారలా మెరుస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Show comments