కృతి కర్బంద: ముద్దు వెనుక పెద్ద కథ

వెండితెరపై ముద్దు సీన్లలో అందాల భామలు 'డీప్‌గా ఇన్వాల్వ్‌' అయిపోవడం వెనుక పెద్ద కథే వుందట. ఆ సమయంలో ఎమోషన్స్‌ ఏవీ పనిచెయ్యకూడదనీ, తెరపై కన్పించేదంతా నటన మాత్రమేనని చెబుతోంది కృతి కర్బందా.

తెలుగులో పవన్‌కళ్యాణ్‌ సరసన 'తీన్‌మార్‌' సినిమాలోనూ, రామ్‌సరసన 'ఒంగోలు గిత్త' సినిమాలోనూ హీరోయిన్‌గా నటించిన కృతి, రామ్‌చరణ్‌ హీరోగా నటించిన 'బ్రూస్‌లీ' సినిమా కోసం హీరోకి అక్కగా మారిన విషయం విదితమే. 

ప్రస్తుతం ఒకటీ అరా కన్నడ సినిమాలతో కెరీర్‌ నెట్టుకొచ్చేస్తోన్న ఈ బ్యూటీ, మొన్నీమధ్యనే బాలీవుడ్‌లో 'రాజ్‌-3' సినిమాలో కన్పించింది. ఎక్స్‌పోజింగ్‌ గురించీ, లిప్‌ టు లిప్‌ కిస్‌ గురించీ కృతి కర్బందా తనదైన అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేసింది.

'ఏ స్థాయిలో ఎక్స్‌పోజింగ్‌ చెయ్యాలనేది దర్శకుడి ఆలోచనల్ని బట్టి వుంటుంది. దర్శకుడు సీన్‌ వివరించాక, అందులో చెయ్యాలా? వద్దా? అన్నదానిపై నిర్ణయం పూర్తిగా హీరోయిన్లదే..' అని చెప్పింది కృతి. 

చాలా సందర్భాల్లో మా అభిప్రాయాల్ని దర్శకులు గౌరవిస్తారు గనుక, పెద్దగా సమస్యలుండవు.. స్విమ్మింగ్‌ పూల్‌లో సీన్‌ చిత్రీకరిస్తున్నప్పుడు, బికినీ తప్పనిసరి.. రొమాంటిక్‌ సీన్స్‌లోని గాఢత గురించి ఏ దర్శకుడైనా ముందుగానే చెబుతాడనీ, సీన్ చిత్రీకరణ జరుగుతున్న ఆ క్షణంలో వ్యక్తిగతంగా ఎలాంటి ఎమోషన్స్‌ ఫీలయ్యే ఛాన్సే వుండదనీ, సీన్‌ అయ్యాక జరిగిందంతా మర్చిపోవడమేననీ, సీన్ చిత్రీకరణకు ముందు చాలా టెన్షన్ పడాల్సి వుంటుందని కృతి కర్బందా చెప్పుకొచ్చింది.

Show comments