బీజేపీ.. మైనారిటీ రాజకీయాలను చాలానే నేర్చింది!

మైనారిటీ మెహర్బానీ.. అంటూ కాంగ్రెస్ మీద విరుచుకుపడటంలో కమలనాథులు ముందుండే వారు. అయితే అధికారంలో ఉంటే కాంగ్రెస్ కు, కమలం పార్టీకి కూడా తేడాలేమీ ఉండవని స్పష్టం అవుతోంది. ఇప్పటికే అంతంతమాత్రం పడే మైనారిటీ ఓట్లను మరింతగా దూరం చేసుకోకూడదని భావించారు మోడీ. కేంద్ర మైనారిటీ వ్యవహరాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లాను క్యాబినెట్ నుంచి తప్పించకపోవడమే దానికి రుజువు.

మోడీ ప్రభుత్వం ఏర్పడుతూనే ఒక నియమాన్ని పెట్టుకుంది. దాని సారాంశం ఏమనగా.. 75 యేళ్లకు పై బడ్డ వాళ్లెవరికీ కేంద్రంలో మంత్రి పదవిని నిర్వహించే అర్హత లేదన్నది! మరి భారతదేశంలో ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా వస్తే.. కేంద్రమంత్రి పదవి కి అర్హత సంపాదించేసరికి 75 యేళ్ల వయసు వచ్చేస్తుంది. ఎవరో మోడీలాంటి లక్కీ ఫెలోస్ కు తప్ప అంత త్వరగా పెద్ద పదవుల అవకాశం రాదు. అయినా కూడా 75 యేళ్ల వయసు పరిమితి విషయంలో వెనక్కు తగ్గేది లేదని మోడీ స్పష్టం చేశారు. దీంతో మురళీ మనోహర్ జోషిలాంటి వాళ్ల కు మంత్రి పదవి అవకాశమే లభించలేదు!

మరి వీర హిందుత్వవాదుల విషయంలో ఆ నియమాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి.. అదే మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి విషయంలో మాత్రం దానికి నీళ్లొదిలారు! 75 యేళ్ల వయసును ఏడాది కిందటే పూర్తి చేసుకున్న నజ్మాహెప్తుల్లాకు మోడీ క్యాబినెట్ లో స్థానం అలాగే ఉంది. వయసు విషయంలో పెట్టుకున్న నిబంధనను ఈమె విషయంలో వర్తింపజేయ లేదు!

76 యేళ్లను పూర్తి చేసుకుని 77 వ సంవత్సరంలోకి అడుగిడిన హెప్తుల్లా ను అదే శాఖ మంత్రిగా కొనసాగిస్తున్నారు. మరి రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్..అనే నియమాన్ని మోడీ మహాశయుడు ఫాలో కాలేకపోయాడు పాపం! హిందుత్వవాదుల విషయంలో, బీజేపీకి పునాదులు వేసిన వారి విషయంలో ఆ నిబంధనను అమలు పరిచి, వాళ్లను తెరమరుగు చేసిన మోడీ ఒక ముస్లిం మంత్రి విషయంలో మాత్రం నిబంధనను పాటించలేకపోవడం ఏమటని కమలం పార్టీ వాళ్లే నిరసన స్వరాలు వినిపిస్తున్నారిప్పుడు. Readmore!

Show comments