బాహబలి మీట్ అందుకేనా?

దేవుడి మీద భక్తా? ప్రసాదం మీదా? అన్నట్లుగా వుంది బాహుబలి టీమ్ వ్యవహారం. నిన్నటికి నిన్న తెలుగు మీడియాతో బాహుబలి టీమ్ ఇంట్రాక్ట్ అయింది. ఇదేంటబ్బా, బాహుబలి టీమ్ కు తెలుగు మీడియా మీద ఇంత ఆసక్తి పుట్టుకు వచ్చింది? అనుకున్నారంతా. అసలు విషయం వేరు. ఈ నెలలోనే బాహుబలి టీమ్ ముంబాయ్ కు వెళ్తోంది. అక్కడ భారీగా మీడియాతో ఇంట్రాక్ట్ కాబోతోంది. అందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 

నేరుగా బాలీవుడ్ లో మీటింగ్ పెడితే, ఇదిగో తెలుగు మీడియాను మరోసారి పక్కన పెట్టేసారు అంటారని, ఓసారి కలిసి హాయ్ చెప్పేస్తే పోలా? అని డిసైడ్ అయ్యారట. సరే, ఓ ప్రెస్ మీట్ పెట్టేసారు. ప్రభాస్ రెండుముక్కలు మాట్లాడారు. రానా ఏదో చెప్పారు. 

రాజమౌళి తెలివిగా సినిమా గురించి వదిలేసి, ఇప్పటికే చాలా మందికి పరిచయం అయిపోయిన వర్చ్యువల్ రియాల్టీ బాక్స్ (టీవీలో శామ్ సంగ్ ఏడ్ చూడుడు) గూగుల్ కార్డ్ బాక్స్ పట్టుకుని, లెక్చరర్ గా పాఠాలు చెప్పారు. తీరా ప్రెస్ మీట్ అయిపోయిన తరువాత యూ ట్యూబ్ లొ ఫ్రెస్ మీట్ చూసిన వారందరికీ ఒకటే అనుమానం, అసలు ఎందుకు మీడియా  ముందుకు వచ్చినట్లు అని?

ఆ విధంగా ఇక ఇక్కడ శాస్త్రానికి వినాయకుడి పూజ మాదిరిగా వ్యవహారం ముగిసిపోయింది కాబట్టి, బాలీవుడ్ కు వెళ్లి బాహుబలి స్పీకర్లు ఇక ఆన్ చేస్తారన్నమాట. 

Show comments