విశాల్‌ 'ట్వీట్‌'తో ఏం చెప్పాలనుకున్నాడు.?

'దిస్‌ పిక్‌ సేస్‌ ఇట్‌ ఆల్‌..' అంటూ ట్వీటేశాడు తమిళ హీరో విశాల్‌. తన లవర్‌ వరలక్ష్మి శరత్‌కుమార్‌ (తమిళ హీరో శరత్‌కుమార్‌ కుమార్తె)తో కలిసి వున్న ఫొటోని విశాల్‌ ట్విట్టర్‌లో పెట్టి, దాని కింద కామెంట్‌ ఇలా పోస్ట్‌ చేశాడు. 'ఫొటో అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది' అన్నది ఆ కామెంట్‌ అర్థం. 

చాలాకాలంగా వరలక్ష్మితో విశాల్‌ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. మొదట్లో, 'అబ్బే.. అలాంటిదేమీ లేదు మా మధ్య.. మేమిద్దరం జస్ట్‌ కో-స్టార్స్‌ మాత్రమే..' అని సెలవిచ్చాడు అప్పట్లో. వరలక్ష్మి కూడా అంతే. శరత్‌కుమార్‌ కుమార్తెగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన వరలక్ష్మి, అతి తక్కువ కాలంలోనే ఇలా ప్రేమాయణంలో పడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదే, శరత్‌కుమార్‌కీ విశాల్‌కీ మధ్య వివాదానికి కారణమయ్యింది. 

నడిగర్‌ సంఘం ఎన్నికల్లో శరత్‌కుమార్‌, విశాల్‌ పోటాపోటీగా తలపడ్డారు కూడా. ఎన్నికల ఫలితాల సంగతి పక్కన పెడితే, ఆ సమయంలో వరలక్ష్మి, విశాల్‌కి అండగా తెరవెనుక యాక్టివ్‌గా పనిచేసిందన్న విమర్శలున్నాయి. కూతురి నుంచి ఈ తరహా టెన్షన్‌ పెరిగిపోవడంతో శరత్‌కుమార్‌ అనారోగ్యంతో మంచం పట్టేశాడు. మొన్నీమధ్యనే తీవ్రమైన చాతీ నొప్పితో శరత్‌కుమార్‌ ఆసుపత్రిలో చేరాడు కూడా. ఈ పరిస్థితుల్లో విశాల్‌, వరలక్ష్మితో వున్న ఫొటోని ట్విట్టర్‌లో పెట్టడమేంటి.? అన్నది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. 

శరత్‌కుమార్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతోనే విశాల్‌, వరలక్ష్మితో కలిసి వున్న ఫొటో పెట్టి, 'అన్ని ప్రశ్నలకూ సమాధానమిదే' అని చెప్పదలచుకున్నాడా.? శరత్‌కుమార్‌ సంగతెలా వున్నా, మేమిద్దరం ఒక్కటయ్యాం.. అన్నది ఆయన మనసులో మాటా.? క్లారిటీ ఇచ్చానని విశాల్‌ అనుకుంటున్నా, క్లారిటీ కాదు కదా.. కొత్త కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్‌ చేశాడనే చాలామంది అభిప్రాయపడ్తున్నారు. Readmore!

Show comments