ఖాకీ డ్రెస్ అచ్చిరాదని తేలిపోయింది

అదంతే..లాజిక్ లు వుండవు. రీజనింగ్ లు అసలే వుండవు. కొన్ని అచ్చిరావంతే. విక్టరీ వెంకటేష్ కు ఖాకీ డ్రెస్ అచ్చిరాదని, పోలీస్ పాత్రల సినిమాలు హిట్ కావని టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్. ఇప్పుడు అదే మరోసారి రుజువైంది. బాబు బంగారం సినిమా టాక్ ఎలా వున్నా, సినిమా ఏవరేజ్ నా ఎబౌవ్ ఏవరేజ్ నా అన్నది పక్కన పెడితే హిట్ అయితే కాదని తేలిపోయింది. 

సూపర్ పోలీస్ లాంటి డిజాస్టర్ ను చూసారు. ఘర్షణ లాంటి ఏవరేజ్ సినిమా చూసారు. ఇప్పుడు బాబు బంగారం చూసేసారు. మొత్తం మీద వెంకీ బాబుకు పోలీస్ క్యారెక్టర్లు అచ్చిరావని మరోసారి రుజువైపోయింది. కానీ నిజానికి సినిమా హీరోలంతా ఒక్కసారైనా ఖాకీ డ్రెస్ వేసుకోవాలని అనుకుంటారు. దాదాపు అందరు హీరోలు ఆ డ్రెస్ వేసుకుని మాంచి హిట్ లు కొట్టినవారే. 

కానీ ఒక్క వెంకటేష్ కే ఎందుకో అచ్చిరావడం లేదుపాపం. సో, దర్శకులు, కథకులు ఫ్యూచర్ లో వెంకటేష్ ను ఉద్దేశించి కథలు రాసుకునేటపుడు ఈ పాయింట్ కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారేమో?

Show comments