రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్?

ఎన్టీఆర్ బయోపిక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు? ఎవరు నిర్మిస్తారు? అన్నది పక్కన పెడితే, ప్రస్తుతం దాని కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ తయారవుతున్న సంగతి మాత్రం వాస్తవం. ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా తీస్తే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ నట జీవితంతో ప్రారంభమై, ముఖ్యమంత్రి పదవీ స్వీకారంతో తొలిభాగం ముగుస్తుంది. మలి భాగంలో మిగిలిన విషయాలు వుంటాయి.

అయితే మళీ భాగం అన్న మాట వట్టిదే అని. కేవలం ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకే సినిమా వుండాలన్నది బాలయ్య అండ్ కో సంకల్పమని, అలా అయితే అసంపూర్తి చరిత్ర అంటారని, అందుకే రెండో భాగం వుంటుంది అన్నది తెరపైకి తెస్తారని తెలుస్తోంది.

మలిభాగం తీయడం అన్నది గోడ మీద ‘రేపు’ అని రాసుకోవడంలా అవుతుందన్నమాట.  పైగా ఇలా రెండు భాగాలు అని ప్రకటించడం, తీస్తే తీయడం, లేదంటే మానడం అనే విద్య దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బాగా అలవాటైనదే.

మొత్తం మీద వినిపిస్తున్న వార్తలను బట్టి బాలయ్య-రామ్ గోపాల్ వర్మ కాంబో ఎన్టీఆర్ బయోపిక్ తప్పదని, తధ్యమని తెలుస్తోంది. ఆ మేరకు రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాధ్ ఇప్పటే బాలయ్యను బాగా ప్రభావితం చేసేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Show comments