అనుష్క.. నిశ్చితార్థం ఖాయమైందా?

బ్రేకప్ అయిపోయిందనుకున్న విరాట్ కొహ్లీ- అనుష్క శర్మల జంట మళ్లీ తెరపైకి వచ్చింది.  త్వరలోనే వీరి నిశ్చితార్థం అనేది తాజా ఖబర్. గతంలో తమ బంధాన్ని బహిరంగ పరుచుకోవడానికి వెనుకాడని ఈ జంట ఇప్పుడు మాత్రం నిశ్చితార్థానికి చాలా సైలెంట్ గా ఏర్పాట్లు చేసుకుంటోందని సమాచారం. “సుల్తాన్’’ సినిమా విడుదల తర్వాత అనుష్క శర్మ –విరాట్ కొహ్లీల నిశ్చితార్థం ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘సుల్తాన్’ లో అనుష్క హీరోయిన్ గా నటించింది. ఇందులో వస్తాద్ గా నటించిన ఆమె ఇప్పుడు ఈ సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇవి కాస్తా పూర్తి కాగానే నిశ్చితార్థం చేసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు హీరోయిన్ గానే కాకుండా బాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా కూడా సినిమాలు రూపొందిస్తున్న అనుష్క విరాట్ కన్నా బిజీగా ఉంది.

కొన్నాళ్ల క్రితం వీరి మధ్య బ్రేకప్ కు కారణం కూడా ఈ బిజీనే అని సమాచారం. అనుష్క ను వివాహం చేసుకోవడానికి విరాట్ ఉత్సాహం చూపించడం, అయితే అది ఇప్పుడప్పుడే కాదని అనుష్క గట్టిగా చెప్పడంతోనే.. వారి మధ్య విబేధాలు వచ్చి దూరమయ్యారని తెలుస్తోంది. ఎంగేజ్ మెంట్ కు అనుష్క సానుకూలంగా స్పందించాకే విరాట్ ఆమెకు మళ్లీ దగ్గరయ్యాడని వీరి సన్నిహితులు అంటున్నారు.

Show comments