వెయ్యి విమానాలు.. మధ్యలో నితిన్

నితిన్ హీరోగా నటిస్తున్న లై సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ అనే విషయం అందరికీ ఇప్పుడర్థమైంది. ఈ మూవీలో ఫైట్స్ కోసం దాదాపు 2 నెలలుగా యూనిట్ అంతా అమెరికాలోనే ఉండిపోయింది. అది కూడా కేవలం యాక్షన్ సన్నివేశాల కోసమే అమెరికాలో ఇన్నాళ్లు తిష్టవేసింది యూనిట్. తాజాగా కాలిఫోర్నియాలోని మిడెస్ట్ లో వెయ్యి విమానాల మధ్యలో క్లైమాక్స్ ను గ్రాండ్ గా తీశారు.

నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా రాబోతోంది లై సినిమా. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు. ప్రస్తుతం విదేశీ స్టంట్ మాస్టర్స్ పర్యవేక్షణలో నితిన్-అర్జున్ మధ్య యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జూన్ 14తో ఈ షెడ్యూల్ ముగుస్తుంది.

అ..ఆ లాంటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ తర్వాత ఈ యాక్షన్ మూవీని సెలక్ట్ చేసుకున్నాడు నితిన్. పైగా మేకోవర్ కూడా అయ్యాడు. అ..ఆ సినిమాకు ఓవర్సీస్ లో ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో లై మూవీకి కూడా కచ్చితంగా వసూళ్లు వస్తాయని మేకర్స్ ఫీలింగ్. కాకపోతే, ఫుల్ లెంగ్త్ యాక్షన్ సబ్జెక్ట్ తో ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా కొట్టలేదు నితిన్. ఈ మధ్య కాలంలో నితిన్ హిట్స్ అన్నీ లవ్ సినిమాలే.

Show comments