సమంత గాసిప్.. తమన్నకు వర్కవుట్ అయింది..

మొన్నటివరకు సమంతపై ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ నడిచింది. రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాలో ఆమె మూగమ్మాయిగా నటించనుందని కొందరు, చూపు సరిగ్గా లేని అమ్మాయిగా కనిపించనుందని మరికొందరు చెప్పుకొచ్చారు. అయితే ఆ ప్రచారాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తిప్పికొట్టింది. అటు సమంత కూడా ఈ మేటర్ ను ఖండించింది. అయితే ఇప్పుడీ పుకారు తమన్న విషయంలో నిజమైంది.

ప్రస్తుతం బాహుబలి-2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న మిల్కీ బ్యూటీ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్ని రివీల్ చేసింది. త్వరలోనే బాలీవుడ్ లో చేయబోయే ఓ సినిమాలో చెవిటి-మూగ అమ్మాయిగా నటించబోతున్నానని ప్రకటించింది తమన్న. నిర్మాత వాసు భగ్నానీ బ్యానర్ పై ఈ సినిమా ఉంటుందని తెలిపింది.

బాహుబలి ప్రాజెక్టు నుంచి తనను కొత్తగా చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, అందుకే ఇకపై క్యారెక్టర్ ఓరియంటెడ్ రోల్స్ మాత్రమే పిక్ చేసుకుంటానని అంటోంది మిల్కీబ్యూటీ. త్వరలోనే ప్రభుదేవాతో కూడా ఓ సినిమా ఉంటుందని.. ఆ మూవీ ప్రేక్షకుల్ని మరింత ఎక్సైట్ చేస్తుందని అంటోంది తమన్న. గతంలో ప్రభుదేవా-తమన్న కలిసి అభినేత్రి సినిమా చేశారు. వసు భగ్నానీ నిర్మాణంలో చేయనున్న మూగ-చెవిటి పాత్రకు సంబంధించి బాహుబలి-2 రిలీజ్ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తానంటోంది మిల్కీ బ్యూటీ.

Show comments