చైతూతో ఇంద్రగంటి సినిమా లేనట్లే

అదేంటో కొన్ని సినిమాలకు ఆది నుంచీ అడుగడుగు గండాలు అన్నట్లు తయారవుతుంది పరిస్థితి. నాగ్ చైతన్యతో మాంచి క్లాస్ ఢైరక్టర్ అనిపించుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా పరిస్థితి ఇలాంటిదే. ఈ సినిమా ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతూ వచ్చింది ఇప్పటి వరకు. ఆ మధ్య క్యాన్సిల్ అని వినిపించింది. మళ్లీ కాదని అన్నారు.

కానీ ఇప్పుడు పక్కాగా తెలుస్తున్న వార్త ఏమిటంటే, ఇంద్రగంటి-చైతూ సినిమా లేనట్లే. ప్రస్తుతం ఇంద్రగంటి తన స్టయిల్ లో ఓ చిన్న సినిమా కు ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ అయిపోయారు. ఈ చిన్న సినిమాలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తారు. ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేసే అవకాశం వుంది. 

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తయారయ్యే ఈ సినిమాకు వేరే హీరో అంటూ ఎవరూ వుండరని వినికిడి. ఇదిలా వుంటే మరి చైతన్యకు ఇంద్రగంటితో సినిమాకు గాను అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత సాయి కొర్రపాటి, మరి ఏ డైరక్టర్ ను సెట్ చేసుకుంటారో? అసలు తెరవెనుక ఏమయిందో? ఏదైనా మాంచి కాంబినేషన్ మిస్ అయిందనే అనుకోవాలి.

Show comments