మణిరత్నం దర్శకత్వంలో కార్తీ హీరోగా 'చెలియా' సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో కార్తీ డిఫరెంట్ లుక్‌తో కన్పిస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో కొత్త లుక్ బయటకొచ్చింది.
అప్పుడెప్పుడో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'రోజా' సినిమా గుర్తుందా.? ఆ తరహాలో రొమాంటిక్ లవ్ స్టోరీకి, దేశభక్తిని అద్దేసినట్టున్నాడు మణిరత్నం. హీరో కార్తీ, ఎయిర్‌ఫోర్స్ అధికారిగా, యుద్ధ విమానానికి పైలట్‌గా ఓ పాత్రలో కన్పిస్తున్నాడు. కొత్త గెటప్ ఏంటంటే, అది టెర్రరిస్ట్‌ని పోలి వుంది. దాంతో సినిమాపై ఇంట్రెస్ట్ డబుల్ అయ్యిందిప్పుడు.
'యుగానికొక్కడు' సినిమా నుంచి ఇప్పటిదాకా.. ఏ సినిమా చేసినా, అందులో ఏదో ఒక 'ప్రత్యేకత' వుండేలా జాగ్రత్తపడ్తున్నాడు కార్తీ. కొన్ని సినిమాలు ఫెయిలయినా, నటుడిగా కార్తీ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. 'చెలియా' సినిమా తన కెరీర్‌లోనే ది బెస్ట్ అవుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లోనే కాకుండా, హిందీలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.