తన పెళ్లిని ప్రభాస్ తో ముడిపెట్టిన రానా?

పెళ్లిపై మరోసారి తనదైన స్టయిల్ లో రియాక్ట్ అయ్యాడు రానా. సోషల్ మీడియాలో షార్ట్ చిట్ చాట్ చేసిన ఈ హీరో.. తన పెళ్లికి అప్పుడే ఏం తొందరొచ్చిందని అభిమానుల్ని ఎదురు ప్రశ్నించాడు. తనకంటే పెద్దవాళ్లయిన ప్రభాస్, నితిన్ పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు ఆలోచిస్తానంటున్నాడు.

నేనే రాజు నేనే మంత్రి ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో మాట్లాడాడు రానా. ఈ సందర్భంగా పెళ్లెప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై  స్పందించాడు రానా. 

'ప్రభాస్, నితిన్ నాకంటే పెద్దవాళ్లు. ముందు వాళ్ల పెళ్లి కానివ్వండి. ఆ తర్వాత నా పెళ్లి సంగతి. ప్రస్తుతం నాకు 33ఏళ్లే. అయినా మా ఇంట్లో వాళ్లే నన్ను తొందర పెట్టడం లేదు, మీకెందుకు తొందర'. ఇది రానా రియాక్షన్.

ప్రస్తుతం ప్రభాస్ కు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. బాహుబలి-2విడుదల తర్వాత ఏ క్షణానైనా ప్రభాస్ కు పెళ్లి చేసేస్తామని ఇప్పటికే ప్రకటించిన కృష్ణంరాజు, ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇక నితిన్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకుంటాడంటూ వార్తలు వస్తున్నాయి. సో.. వీళ్లిద్దరి పెళ్లిళ్ల తర్వాత రానాను క్వశ్చన్ చేయాలన్నమాట.

Show comments