మాజీ ప్రియుడికి దగ్గరయిన హీరోయిన్!

సల్మాన్ ఖాన్ కు తాజా సన్నిహితురాలు అనే ప్రచారాన్ని పొందిన అమీ జాక్సన్.. ఆ విషయాన్ని ఖండించిన విషయం తెలిసిందే. ఈ బ్రిటిష్ బ్యూటీ సల్మాన్ కు చాలా దగ్గరైందనే పేరును తెచ్చుకుంది. అయితే ఏ ఆడపిల్ల అయినా సల్మాన్ కు ప్రియురాలిగా ఉండాలని కోరుకుంటుందని, తనకు ఆ అదృష్టం లేదని.. ఆ రూమర్లకు తెరదించింది.

ఆ సంగతలా ఉంటే.. అమీ మరో ప్రేమాయణాన్ని మాత్రం సాగిస్తోందట. ఇది ఆమె మాజీ ప్రియుడితోనేనట. అతడు…ఒక  బ్రిటిష్ బాక్సర్ పేరు. జోసెఫ్ సెల్క్రిక్. ఇది వరకూ వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలారు. అయితే అతడు తనను వేధించాడని అంటూ రెండేళ్ల కిందట దూరం అయ్యింది అమీ. ఇలా దూరం అయ్యాకా సినిమాల్లో ఈమె బిజీ అయిపోయింది.

ఇటీవలే సల్మాన్ తో ఎఫైర్ అంటూ రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏమైందో ఏమోకానీ మాజీ ప్రియుడికి అమీ మళ్లీ దగ్గరైందట. అతడికి ఈమె రెండో ఛాన్సు ఇచ్చిందట. 

Show comments