మనం చెప్పినట్లే మహేష్ టైటిల్

మహేష్ బాబు-మురుగదాస్ సినిమా కోసం మహేష్ సినిమాలోని ఓ పాటలోని పదాన్ని టైటిల్ గా అనుకుంటున్నారని నవంబర్ 29న గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. ఇప్పుడే అదే పక్కా అయింది. మహేష్ నటించిన ఒక్కడు సినిమాలోని సంభవామి..పాటలోంచి కొత్త సినిమా టైటిల్ పుట్టింది. 

సంభవామి అనే టైటిల్ ను యూనిట్ రిజిస్టర్ చేయించింది. అయితే ఇది కూడా పక్కగా ఫైనల్ కాలేదు. అయిదు టైటిళ్లు పరిశీలించి, ఇది తాత్కాలికంగా ఫైనల్ చేసారు. ఇదంతా జరిగింది నవంబర్ 28నే. ఇప్పుడు ఎందుకయినా మంచిది అని రిజిస్టర్ చేసారు. ఇంకా మంచి టైటిల్ దొరుకుతుందా అన్న అన్వేషణ మాత్రం ఆగలేదు. 

కొందరు సంస్కృత పండితులను కూడా టైటిల్ విషయంలో సంప్రదించారు. తెలుగు తమిళ భాషల్లోకి సరిపోయే సంస్కృత పదం, అది కూడా విశ్వరక్షకుడు లేదా లయకారకుడు హీరో అనే అర్థంలో టైటిల్ కోసం చూస్తున్నారు. ఏదీ దొరక్కపోతే సంభవామి ఫిక్స్ అయిపోతుంది.

Show comments