'స్పైడర్‌' - సూపర్‌ స్టార్‌ సూపర్బ్‌ న్యూ లుక్‌

మహేష్‌బాబు తాజా సినిమా 'స్పైడర్‌' ఈ విజయదశమికి ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి తొలి ఆడియో సింగిల్‌ని విడుదల చేయనున్నారు. ఆడియో సింగిల్‌ సంగతి పక్కన పెడితే, ఆడియో సింగిల్‌ విడుదలకు సంబంధించి చిత్ర యూనిట్‌ విడుదల చేసిన స్టిల్‌ ఓ ఊపు ఊపేస్తోంది. 

స్టైలిష్‌ లుక్‌తో మహేష్‌ కన్పిస్తోంటే, అభిమానులు ఓ రేంజ్‌లో థ్రిల్‌ ఫీలవుతారనడం నిస్సందేహం. ఇంగ్లీష్‌ లెటర్స్‌లో 'స్పైడర్‌'ని చూశాం. ఇప్పుడు తెలుగు లెటర్స్‌లో 'స్పైడర్‌'ని చూస్తున్నాం. ఇంగ్లీష్‌ డిజైన్‌ని మించి తెలుగు డిజైన్‌ని ఇన్నోవేటివ్‌గా రూపొందించారని చెప్పొచ్చు. 'స్పైడర్‌'లోని 'డ' లెటర్‌ మీద తలకట్టుని రివర్స్‌లో పెట్టడం ప్రత్యేకతగా చెప్పుకోవాలేమో. ఇంగ్లీషు టైటిల్‌లోని 'వై' షేప్‌ని, 'డ' లెటర్‌లోని తలకట్టుకి ఆపాదించారు. 

మొత్తమ్మీద, 'స్పైడర్‌' నుంచి ఏ స్టిల్‌ వస్తున్నా, అది ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. అభిమానుల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతోంది. స్టిల్స్‌కే ఇలా వుంటే, ఆడియో సింగిల్‌ వచ్చాక అభిమానుల్లో ఆ 'ఊపు' ఇంకెలా వుంటుందో.! టీజర్‌ వచ్చాక, అభిమానుల ఆనందం ఇంకే రేంజ్‌లో వుంటుందో.! ఈ స్వీట్‌ పెయిన్‌ని భరించాల్సి రావడం అభిమానులకి ఒకింత కష్టమే. 

ఇదిలా వుంటే, తెలుగుతోపాటు తమిళంలోనూ 'స్పైడర్‌'ని విడుదల చేయనున్న విషయం విదితమే. ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో మహేష్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Show comments