సుచి లీక్స్ లో తనను తాను చూసుకోవాలనుకుంది

సుచి లీక్స్ నుంచి బయటపడేందుకు తారలంతా విశ్వప్రయత్నాలు చేశారు. భారీ మొత్తానికి సెటిల్ మెంట్ చేసుకొని ఎలాగోలా ఒడ్డున పడ్డారు. ఇప్పుడా ఎకౌంట్ లేదు. కానీ ఆ ప్రకంపనలు మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా హీరోయిన్ అమలాపాల్ ఈ వ్యవహారంపై మాట్లాడింది. ఊరికే మాట్లాడితే ఫర్వాలేదు, ఏకంగా చిన్న సైజు సెన్సేషనే క్రియేట్ చేసింది.

సుచి లీక్స్ లో తనను తాను చూసుకోవాలనుకుందట అమలాపాల్. హీరోయిన్లుగా చెప్పబడే కొందరి నగ్నచిత్రాలు, అశ్లీల వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే, తన వీడియో/ఫొటో ఎప్పుడు బయటకొస్తుందా అని అమలాపాల్ ఆశగా ఎదురుచూసిందట. కానీ అంతలోనే ఎకౌంట్ డీ-యాక్టివేట్ అయిపోయిందని చెబుతోంది.

అంటే సుచిలీక్స్ లో తన వీడియోలు, ఫొటోలు ఏవీ బయటకు రాలేదని ఇండైరెక్ట్ గా చెబుతోంది ఈ బ్యూటీ. కానీ అమలాపాల్ కు చెందినదిగా చెబుతున్న ఓ వీడియో అప్పట్లో సుచిలీక్స్ లో బాగానే వైరల్ అయింది. ఆ వీడియోపై మాత్రం ఈ భామ రియాక్ట్ అవ్వలేదు. తనది కాని వీడియోపై ఎలా స్పందిస్తానంటూ రివర్స్ లో క్వశ్చన్ చేస్తోంది.

Show comments