చప్పట్లు కొట్టారు సరే...చట్టం చేసే దమ్ముందా?

క్రిష్ణా పుష్కరాలను చాలా ఘనంగా నిర్వహించి.. ప్రకృతి  మరియు దాని గొప్పదనం, ఆధ్యాత్మికత అనే అంశాలను చంద్రబాబునాయుడు ప్రధానంగా ప్రస్తావించారు. కానీ.. వాస్తవంగా ప్రకృతి సమతుల్యత కాపాడడం అంటే పుష్కరాలు కాదనే సంగతిని ఆయన ప్రజలు గుర్తించకుండా ఉండేలా ఊదరగొట్టారు. 

కానీ చివరిరోజు ముగింపు సభలో ఓ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబుకు చిన్నపాటి షాక్ ఇచ్చారు. అసలైన ప్రకృతి ప్రేమ గురించి ఆయన ప్రస్తావించడంతో బాబు సహా, గుమికూడిన నేతలంతా.. భారీస్థాయిలో చప్పట్లు కొట్టారు. కానీ ఆయన సూచనను చట్టబద్ధంగా ఆచరణలోకి తెచ్చే దమ్ము వీరికి ఉందా? అనేది అసలు సంగతి... వివరాల్లోకి వెళితే. 

పుష్కరాల చివరి రోజున చంద్రబాబు తన పార్టీ నాయకులందరినీ పోగేసి, తాను పడ్డ కష్టాన్నంతా వారికి సినిమా స్కోపులో వివరించి, చప్పట్లు కొట్టించుకున్నారు.  రాష్ట్రం లో ఇక మీదట సాంకేతిక  సుపరిపాలన విధానాన్ని ప్రవేశపెడతామంటూ అందుకోసం ప్రజాప్రతినిధులందరికీ  సాంకేతిక సుపరిపాలన శిక్షణ తరతగుల గురించి వివరిస్తూ, విజయవాడ దుర్గాఘాట్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంత్రులు, ఎమ్మెలెలు, ఎమ్మెల్సిలు, ఇతర ప్రజాప్రతినిధుల కు కంట్రోల్ రూమ్ పనితీరుపై అవగాహన కల్పించారు. 

ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో పర్యావరణానికి హనీ కలగకుండ ప్లెక్సీల ను రద్దు చేయాలంటూ  ఓ నాయకుడు బహిరంగ సూచన చేశారు. దీనివల్ల కార్యకర్తలకు ఆర్థికభారం కూడా పెరిగిపోతున్నదని ఆయన చెప్పారుట. ఈ సూచనకు అక్కడున్న నాయకులు అందరూ అమోదం తెలిపి చపట్లు కొట్టారు. వాస్తవంగా ఫ్లెక్సీలు పర్యావరణానికి చాలా ద్రోహం చేస్తున్నాయనడంలో అబద్ధం లేదు. కనీసం మునిసిపల్ అధికారుల అనుమతి లేకుండా పెట్టడం నిషేధం అంటూ కఠినంగా నిబంధనలు పెట్టాల్సి ఉంది.  Readmore!

అయితే ఇప్పుడు జనానికి కలుగుతున్న సందేహం ఏంటంటే.. అక్కడ చప్పట్లు కొట్టారు సరే,  నిజంగా పర్యవరణం మీద అంత ప్రేమ వుంటే ఫ్లెక్సీ లను రద్దు చేసే చట్టం తేగలరా. అలా గనక చట్టం వస్తే ప్రతి చిన్న విషయానికి ఫ్లెక్సీ లు వేసుకునే చోటా నాయకుల నుండి పెద్ద పెద్ద హొర్డింగలతో పబ్లిసిటి చేసుకునే బడా నాయకుల సంగతేంటి.  ఒక వేళ చట్టం తెచ్చినా ప్రజలు పాటిస్తారా. చట్టం చట్టమే మేము చేసేది ...చేసేదే అనే వాళ్ళకి సమాధానం చెప్పగలరా! అని. 

అందుకు ఉదాహరణ పర్యవరణానికి అత్యంత ప్రమాదకరమైన ప్లాస్టిక్ సంచులను ఆపగలుతున్నారా?? నిజంగా ఫ్లెక్సి లను నియత్రించి మున్సిపల్  పరిధిలకు లోబడి  తగు మాత్రంగా వుంటే ఫర్వాలేదు. కానీ ప్రతి కరెంట్ స్ధంబానికి, చెట్టుకు పుట్టకి, సందు సందు కి ఎక్కడ బడితే అక్కడ విచ్చలవిడిగా వుండటం పర్యవరణాని కి చాలా పెద్ద ప్రమాదం. చప్పట్లు కొట్టి సంబరపడిపోవడం కాదు చట్టం తెచ్చి ఖచ్చితంగా అమలు చేయగల దమ్ము కూడా వుండాలి. 

Show comments

Related Stories :