ఈ అడ్వాన్స్ లు అంతే సంగతులా?

డైరక్టర్లు ఫామ్ లో వుంటే అడ్వాన్స్ లు కుప్పలుగా వచ్చి పడతాయి. తీరా వ్యవహారం తేడా వస్తే వస్తుంది సమస్య. అడ్వాన్స్ లు అంత సులువుగా వెనక్కు రావు. అలా అని సినిమా తీసి ముందుకు వెళ్లలేరు. ఇండస్ట్రీలో చాలా మంది డైరక్టర్ల దగ్గర చాలా మంది నిర్మాత అడ్వాన్స్ లు ఇలాగే వున్నాయి. 

శ్రీకాంత్ అడ్డాల హిట్ లు కొట్టాడు. కానీ ఇప్పుడు ఫామ్ లో లేడు.. బ్రహ్మోత్సవం లాంటి భయంకరమైన డిజాస్టర్ ఇచ్చాడు. అతగాడి దగ్గర గీతా ఆర్ట్స్ అడ్వాన్స్ వుంది. బన్నీ కోసం ఇచ్చినది అది. మరి ఇప్పుడు బన్నీతో చేయిస్తారా? చిన్న సినిమా ఏదయినా చేయించాలా? 

ఇక హరీష్ శంకర్ దగ్గరా అలాగే అడ్వాన్స్ వుంది. అతగాడు ఫామ్ లో లేడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిన్న సినిమా తీసిన తరువాత ఖాళీగా వున్నాడు. ఇప్పుడు అతగాడితో బన్నీ కాంబినేషన్ లో సినిమా చేయాలా వద్దా?  ఇద్దరు మంచి డైరక్టర్లే. కానీ ఫామ్ లో లేరు. సరైన సబ్జెక్ట్ లు లేవు. దాంతో అడ్వాన్స్ లు అబేయన్స్ లో వుండిపోయాయి. ఇలాంటి కథలు ఇంకా చాలా వున్నాయి.

Show comments