తాప్సీతో పెట్టుకుంటే అంతే

తాప్సీ అనగానే అందరికీ బబ్లీ బ్యూటీ గుర్తుకొస్తుంది. కానీ, 'బేబీ' సినిమా చూస్తే మాత్రం, తాప్సీలోని యాక్షన్‌ గర్ల్‌ కన్పిస్తుంది. ఇప్పుడు ఆ 'బేబీ' సినిమాకి ప్రీక్వెల్‌ రూపొందుతోంది. 'నామ్‌ షబానా' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమా కోసం తాప్సీ చాలా కష్టపడింది. కిక్‌ బాక్సింగ్‌లో అరివీరభయంకరమైన శిక్షణ తీసుకుందట తాప్సీ. ఈ క్రమంలోనే తాప్సీ కొన్నిసార్లు దెబ్బలు కూడా తినేసిందట. ఏం చేసినా సినిమా కోసమేనంటోంది తాప్సీ. 

తాజాగా, ఈ సినిమా కోసం తీసుకున్న ట్రైనింగ్‌ తాలూకు వీడియో క్లిప్‌ని తాప్సీ సోషల్‌ మీడియాలో పెట్టింది. ముందు ముందు ఇంకొన్ని వీడియో క్లిప్స్‌తో తాప్సీ సినిమాపై హైప్‌ పెంచే పనులు చేపట్టనుంది. 'పింక్‌' సినిమా తర్వాత తన ఆలోచనలు చాలావరకు మారిపోయాయనీ, ఇకపై గ్లామరస్‌ అవతార్‌ని కొన్నాళ్ళపాటు పక్కన పెడతాననీ తాప్సీ చెప్పుకొచ్చింది. 

సినిమాల కోసమే కాదు, యువతులకు కిక్‌ బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించేందుకోసం కూడా తాను కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకున్నట్లు చెబుతోంది తాప్సీ. ఇప్పుడు అమ్మాయిలకి కిక్‌ బాక్సింగ్‌, కరాటే, కుంగ్‌ఫూ వంటి పోరాట విద్యల్లో ప్రావీణ్యం తప్పదంటోన్న తాప్సీ, సెల్ఫ్‌ డిఫెన్స్‌ టెక్నిక్స్‌ తెలియకపోతే, ఇప్పుడున్న సమాజంలో అమ్మాయిలు మనుగడ సాధించలేరని తాప్సీ అభిప్రాయపడింది. తన జోలికి ఎవడన్నా ఆకతాయి వస్తే, పవర్‌ఫుల్‌ పంచెస్‌ ఇవ్వగల టాలెంట్‌ తాను సొంతం చేసుకున్నానని తాప్సీ క్యూట్‌ క్యూట్‌గా బెదిరించేస్తోదండోయ్‌.!

Readmore!
Show comments