శర్వానంద్-ఓ మంచి పోలీస్

టాలీవుడ్ లో పోలీస్ క్యారెక్టర్లు అంటే ఒకప్పుడు యాంగ్రీ అండ్ ఫైర్ తో వుండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పటాస్ లో, టెంపర్ లో కరెప్టెడ్ పోలీస్ క్యారెక్టర్లు చూసాం. తడాఖాలో ఫన్నీ పోలీస్ ను చూసారు. రాబోయే బాబు బంగారంలో జాలి గల పోలీస్ ను చూడబోతున్నారు. ఇక హీరో శర్వానంద్ కూడా పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడట. 

అది కూడా ఇలా కాస్త వైవిధ్యమైదే. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ అందించే పోలీస్ క్యారెక్టర్ ను పోషిస్తున్నాడట. ఈ పోలీస్ ఫైట్లే చేయడట. ఇలాంటి ఓ వెరైటీ క్యారెక్టర్ ను కొత్త దర్శకుడు చంద్రమోహన్ రూపొందించాడట. ఈ దర్శకుడు గతంలో క్రాంతి మాధవ్ దగ్గర సహాయకుడిగా పనిచేసాడట. 

భోగవిల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దర్శకుడు చంద్రమోహన్ వెరైటీ పోలీస్ ఆఫీసర్ గా శర్వానంద్ ను చూపించబోతున్నాడు. ఈ సినిమా షూట్ చకచకా సాగుతోంది.

Show comments