జగన్.. రిషికేష్ లో పూజా కార్యక్రమాల్లో..

ప్రత్యేకహోదా అంశం గురించి కేంద్ర ప్రభుత్వ ప్రముఖులకు, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయడానికి వెళ్లిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అటు నుంచి అటే రిషికేష్ చేరుకున్నాడు. ప్రతిపక్ష నేత అక్కడకు వెళ్లడానికి ఒక ఆసక్తికరమైన రీజన్ ఉంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర ఆశీస్సుల కోసం జగన్ రిషికేష్ వెళ్లాడు. ఈ స్వామీజీ తెలుగువారే అని వేరే చెప్పనక్కర్లేదు. 

స్వాములోరికి రిషికేష్ లో కూడా ఆశ్రమం ఉంది. ప్రస్తుతం ఆయన అక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన అక్కడ నుంచి రిషికేష్ వెళ్లి జగన్ స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకొంటున్నారు.

ఇది వరకూ కూడా.. శారదా పీఠాధిపతిని పలు సార్లు దర్శనం చేసుకున్నాడు జగన్ మోహన్ రెడ్డి. ఇది ఎక్కడి వరకూ వచ్చిదంటే.. తెలుగుదేశం వాళ్లు శారదా పీఠాధిపతిపై విరుచుకుపడేంత వరకూ. జగన్ కు కలిసే అవకాశం ఇస్తే.. అది ఎవరినైనా తాము తిడతామన్నట్టుగా స్వరూపనందేంద్ర  పై విమర్శలు చేశారు తెలుగుదేశం నేతలు.

మరి ఇప్పుడు రిషికేష్ లో స్వరూపనందేంద్ర ఆధ్వర్యం లో జరుగుతున్న పూజల్లో జగన్ బృందం పాల్గొనడాన్ని తెలుగుదేశం వాళ్లు ఏమంటారో! రాష్ట్రం కోసమే ఈ పూజలు జరుగుతున్నాయని.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే కోరికతో జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాడని వైకాపా ప్రకటించింది. 

Show comments