బాబీ గత చిత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్' నిరాశ పరిచినప్పటికీ అతనితో ఎన్టీఆర్ 'జై లవకుశ' చేయడానికి అంగీకరించడం ఆశ్చర్యపరిచింది. అయితే దర్శకుడి ట్రాక్ రికార్డ్ చూడకుండా, అతను చెప్పిన కథలో బలం చూసి ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని ఓకే చేసాడట. 'జనతా గ్యారేజ్' తర్వాత యాభైకి పైగా కథలు విన్న ఎన్టీఆర్ దీనిని ఓకే చేసాడు.
ఎన్టీఆర్‌కి అత్యంత సన్నిహితుడు అయిన వక్కంతం వంశీ చిత్రాన్ని కూడా వదిలేసి మరీ బాబీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాబీ చెప్పిన కథలో త్రిపాత్రాభినయం అనేది మాత్రమే కాకుండా నటుడిగా తన టాలెంట్ చూపించడానికి స్కోప్ కూడా చాలా వుందని ఎన్టీఆర్ తెలుసుకున్నాడు. అందుకే మరేం ఆలోచించకుండా ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేసాడు.
ఇందులో ఎన్టీఆర్ వేస్తున్న మూడు గెటప్స్‌లో ఒకటి మాత్రం అదిరిపోతుందని, ఎన్టీఆర్ సరికొత్తగా కనిపిస్తాడని సమాచారం. ఈ క్యారెక్టర్ గెటప్ కోసమే విదేశీ మేకప్ ఆర్టిస్టులని హైర్ చేసుకున్నారు. ఈ గెటప్‌ని ఇప్పుడే రివీల్ చేయరని, రిలీజ్‌కి దగ్గర పడిన తర్వాత ఒకేసారి ఈ లుక్‌ని గ్రాండ్‌గా రివీల్ చేస్తారని తెలిసింది. ఈ క్యారెక్టర్ గురించి వస్తోన్న అప్‌డేట్స్‌తో ఎన్టీఆర్ ఫాన్స్‌లో ఈ చిత్రం పట్ల ఎక్సయిట్‌మెంట్ పెరిగిపోతోంది.