మహేష్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడు..? ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పినా చెప్పలేకపోయినా ఆ సినిమాలో హీరోగా నటిస్తున్న మహేష్ వద్ద మాత్రం కచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. అంతా ఇలానే ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ తన సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మహేష్ కూడా చెప్పలేకపోతున్నాడు. ఈ ఉగాదికి మహేష్ మూవీ ఫస్ట్ లుక్ లేదా టైటిల్ విడుదల ఉంటుందని అంతా ఎదురుచూస్తున్న టైమ్ లో.. మహేష్ చేసిన ప్రకటన అభిమానుల ఆశలను నీరుగార్చింది. ఓ ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరైన మహేష్.. ఉగాదికి తన సినిమా ఫస్ట్ లుక్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు అన్నట్టు మాట్లాడాడు.
మురుగదాస్-మహేష్ మూవీ మ్యాగ్జిమమ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు, కేవలం ఫస్ట్ లుక్ కోసమే మహేష్ పై ప్రత్యేకంగా షూటింగ్ కూడా చేశారట. అయినప్పటికీ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్, టైటిల్ ఎనౌన్స్ మెంట్ కు సంబంధించి 3-4 నెలలుగా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మహేష్ ప్రకటనతో ఆ సస్పెన్స్ ఇంకాస్త పెరిగింది.
నిజానికి ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్, టైటిల్ ఎనౌన్స్ మెంట్ లాంటి అంశాల్ని మహేష్ పట్టించుకోవడం లేదు. దీనిపై నిర్ణయాన్ని పూర్తిగా దర్శకుడికే వదిలేశాడు. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని టోటల్ గా దర్శకనిర్మాతలకే విడిచిపెట్టాడు. అందుకే ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాన్ని మహేష్ కచ్చితంగా చెప్పలేకపోతున్నాడు.