స్పైడర్ తమిళ్ @ 23 కోట్లు

మహేష్-మురుగదాస్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న స్పైడర్ సినిమా తమిళ వెర్షన్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోయాయి. ప్రసిద్ధ లైకా సంస్థ ఏకంగా 23 కోట్లకు ఈ హక్కులు తీసుకుంది. ఈ సినిమాతో నేరుగా తమిళ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు తొలిసారిగా.

ఈ దసరాకు విడుదలవుతున్న ఈ సినిమా బడ్జెట్ నే 130కోట్లు. అమ్మకాలు 150కోట్లు. ఇప్పటికే ఆంధ్ర 36కోట్ల రేషియోలో అమ్మేసారు. నైజాం ను దిల్ రాజు, సీడెడ్ ను నిర్మాత ఎన్వీ ప్రసాద్ ను పంపిణీ చేస్తున్నారు. అన్ని భాషల శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా ఈ సినిమా 26కోట్లకు పైగా సంపాదించింది. 

మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారి నటిస్తున్న ఈ సినిమాలో దర్శకుడు ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. హారిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మూడు దేశాల్లో ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు చురుగ్గా జరుగుతున్నయి. బయో టెర్రరిజం నేపథ్యంలో సినిమా కథ అల్లుకున్నట్లు తెలుస్తోంది.

Show comments