బాహుబలి 2 లో అనుష్క చెక్కుడు?

బాహుబలి సిరీస్ అంటేనే గ్రాఫిక్స్ కీలకం అన్న సంగతి తెలిసిందే. దీనికోసం భారీ ఖర్చు కూడా తప్పదు. అయితే ఇప్పుడు బాహుబలి 2 కోసం ఈ గ్రాఫిక్స్ ఖర్చు మరి కొంచెం పెరిగిందట. ఖర్చే కాదు, వర్కంగ్ టైమ్ కూడా పెరిగుతోందట. దీనికి కారణం మరేం కాదు, హీరోయిన్ అనుష్క. 

ఈ వైనం ఏమిటంటే, సైజ్ జీరో తరువాత అనుష్క ఓ రేంజ్ లో వళ్లు చేసిన సంగతి తెలిసిందే. అనుష్క ఫిజిక్ తగ్గితే బాహుబలి 2 బ్యాలెన్స్ వర్క్ చేద్దామని రాజమౌళి చాలా ట్రయ్ చేసాడు. కానీ స్వీటీ ఫిజిక్ రాజమౌళి ఆశించిన మేరకు తగ్గలేదట. ఆఖరికి వీలయినంత అడ్జెస్ట్ చేసుకుంటూనే వర్క్ ఫినిష్ చేసేసారట. ఇప్పుడు అనుష్క ఫేస్ లోని ఛబ్బీనెస్ ను, బాడీలో ఎగస్ట్రా ఫ్యాట్ ను స్క్రీన్ మీదకు రాకుండా చేసే పనిని గ్రాఫిక్స్ జనాలకు అప్పగించారట. 

అంటే బాహుబలి గ్రాఫిక్స్ కాంట్రాక్ట్ కు ఇది అదనం అన్నమాట. అనుష్కను వీలయినంత మెరుపుతీగలా, అందంగా చూపించే పనిలో ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్ వీరులు బిజీగా వర్క్ చేస్తున్నట్లు వినికిడి. సినిమా చూస్తే ఈ వైనం తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు స్వీటీ ఎలా వుందో బయట అప్పుడప్పుడు కనిపిస్తున్నపుడు తెలుస్తోంది కదా?

-సాయి

Show comments