మరో క్రికెటర్, బాలీవుడ్ నటి.. ప్రేమాయణం!

క్రికెట్ కు బాలీవుడ్ కు ఉన్న బంధం ఏమీ కొత్తది కాదు. చరిత్రను పరిశీలిస్తే.. బోలెడన్ని ప్రేమాయణాలు, అనేక ఎఫైర్లు, కొన్ని పెళ్లిళ్లు. ఆరు ఎఫైర్లు, మూడు పెళ్లిళ్లు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. లీడింగ్ క్రికెటర్ విరాట్ కొహ్లీ, అనుష్కల మధ్య నడుస్తున్న ప్రేమాయణం కూడా ఆసక్తిని రేపుతోంది.

ఈ సంగతిలా ఉంటే.. మరో క్రికెటర్ ఒక బాలీవుడ్ నటీమణితో ప్రేమాయణాన్ని సాగిస్తున్నాడనే మాట వినిపిస్తోంది. వీళ్లిద్దరూ కలిసి కనిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ప్రేమ జంట.. మరెవరో కాదు, మాజీ  క్రికెటర్ జహీర్ ఖాన్ – సాగరిక ఘడ్గేలది. వీళ్లిద్దరూ ఢిల్లీలో జరిగిన యువరాజ్ సింగ్ వెడ్డింగ్ రిషెప్షన్ లో జంటగా కనిపించారు.

జంటగా వచ్చారు, జంటగా ఫొటోలు దిగారు. యువీ మ్యారేజ్ రిషెప్షన్ లో విరాట్- అనుష్కాల జంటే కాకుండా జహీర్ – సాగరికల జంట కూడా కనువిందు చేసింది. రిషెప్షన్ లో వీళ్ల ఫొటోలను ట్వీట్ చేస్తూ రోహిత్ శర్మ చేసిన కామెంట్ కూడా ఆసక్తికరంగా ఉంది. నెక్ట్స్ మీరే.. అనే అర్థం వచ్చేలా, రోహిత్ ట్వీట్ చేశాడు.

ఈ సాగిరక ఘడ్గేను పరిచయం చేయాలంటే.. ‘చక్ దే ఇండియా’ సినిమాను గుర్తు చేయాలి. అందులోని హాకీ ప్లేయర్లలో ఒకరిగా కనిపించింది ఈమె.  జహీర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇప్పటికే రిటైర్ అయ్యాడు. అయితే పెళ్లి మీద గాలి మళ్లినట్టుగా లేదు. 

వెనుకటికి ఒక బాలీవుడ్ తారతో డేటింగ్ చేసిన చరిత్ర ఉంది ఇతడికి. ఇషా శర్వాణీ అని.. సుభాష్ ఘాయ్ ‘కిస్నా’ సినిమాలో నటించిందే, ఆమెతో కూడా జహీర్ అనుబంధాన్ని కొనసాగించాడు. ఆమెతో జంటగా విహరించాడు కూడా. అయితే ఆ బంధం బ్రేకప్ అయ్యింది. మరి సాగరికతో కథ ఎంత వరకూ వెళ్తుందో!

Show comments