పూజలు షురూ

మంచి ముహుర్తాలు మళ్లీ ఇప్పట్లో లేవు అనడంతో కొత్త సినిమాలకు ఓపెనింగ్ లు టక్ టక్ మంటూ క్లాప్ లు పడుతున్నాయి. సునీల్-ఎన్ కౌంటర్ శంకర్ సినిమాకు పూజ ఈ రోజు జరిగిపోయింది. అలాగే నిఖల్-సుధీర్ వర్మ కాంబినేషన్ సినిమాకు రేపు పూజ జరగబోతోంది. ఇక రవితేజ-పవర్ బాబి సినిమాకు ఎల్లుండి పూజ చేస్తున్నారు. 

ఇవి కాక ఇంకా చిన్నా చితకా సినిమాలు మూడు నాలుగు వున్నాయి. సుధీర్ వర్మకు దోచేయ్ డిజాస్టర్ తరువాత ఇదే అవకాశం. అలాగే పవర్ బాబికి సర్దార్ గబ్బర్ సింగ్ తరువాత ఇదే చాన్స్. ఈ ఇద్దరు డైరక్టర్లకు కూడా మళ్లీ తమ తొలి సినిమా హీరోలే చాన్స్ లు ఇవ్వడం. నిఖిల్ సినిమాను అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తుంటే, రవితేజ సినిమాను చుట్టాలబ్బాయి సినిమా నిర్మించిన నిర్మాతల్లో ఒకరు టేకప్ చేసారు. 

ఇంకో విశేషమేమిటంటే, అన్నీ పూజలే. షూటింగ్, ఇతరత్రా వ్యవహారాలు అన్నీ ఇప్పుడు కాదు. ఇంకా మరో నెల తరువాతే. మంచి ముహుర్తాలు లేవని పూజలు కానిచ్చేస్తున్నారంతే.

Show comments