ఫస్ట్ వీక్ తోనే బ్రేక్ ఈవెన్?

బాహుబలి 2 తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు స్టడీగానే వున్నాయి. మూడో రోజు నాటికి 74 కోట్ల మేరకు షేర్ వసూలు చేసింది. 130 కోట్ల మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అమ్మకాలు సాగించారు. ఇందులో నైజాం కు అంచనా వేసిన 45 కోట్లకు పైగా మొత్తం కూడా వుంది. ఆ మొత్తం తీసేస్తే 85 కోట్ల మేరకు అమ్మకాలు సాగించారన్నమాట. 74 కోట్ల వసూళ్లలో నైజాం వసూళ్లు పక్కన పెడితే 55 కోట్లు. అంటే 85 కోట్ల అమ్మకాలకు 55 కోట్లు వచ్చేసాయి మొదటి మూడు రోజుల్లో. నాలుగో రోజు కూడా సెలవు దినమే. అందుచేత మరో పది కోట్లు కలిసే అవకాశం కచ్చితంగా వుంది. అంటే టోటల్ ఫోర్ డేస్ కు 65 కోట్లు వచ్చేసినట్లే. అంటే ఇక మిగిలిన మంగళ, బుధ, గురు వారాల్లో మిగిలిన పది కోట్లు రావాలన్న మాట.

అలా వస్తే, ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ అయినట్లే. అయితే ఏరియాల వారీ చూసుకుంటే లెక్క కొంచెం తేడా వస్తుంది. సీడెడ్ లాంటి ఏరియాలు బ్రేక్ ఈవెన్ కావడానికి కాస్త ఎక్కువ టైమ్ పడుతుంది. ఉత్తరాంధ్ర, నెల్లూరు లాంటి ఏరియాలు వీక్ పూర్తి కాకుండానే బ్రేక్ ఈవెన్ కు వచ్చే అవకాశం వుంది. అన్నింటికన్నా చివరగా బ్రేక్ ఈవెన్ కు చేరేది సీడెడ్ మాత్రమే కావచ్చు. ఎందుకంటే ఆ ఏరియా హక్కులకు 25 కోట్లకు పైగా ఖర్చు చేసారు వారాహి చలన చిత్ర అధినేత సాయి కొర్రపాటి. విశేషం ఏమిటంటే అన్నింటికన్నా ముందుగా బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తున్న ఉత్తరాంధ్ర హక్కులు కూడా ఆయనవే. 

Show comments