అయ్యో.. శృతిహాసన్ ఏంటి ఇలా..!

కాటమరాయుడు సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. చిరంజీవి, బాలయ్య సినిమాల తర్వాత భారీ అంచనాలతో ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన మూవీ ఇదే. ప్రస్తుతం సినిమా వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. సినిమాలో ఎన్ని ఎట్రాక్షన్స్ ఉన్నప్పటికీ హీరోయిన్ శృతిహాసన్ మాత్రం అందరికీ హోల్ సేల్ గా షాకిచ్చింది. కాటమరాయుడులో శృతిహాసన్ ను చూసి చాలామంది షాక్. మరీ ముఖ్యంగా సాంగ్స్ లో ఆమె లుక్స్, డ్రసెస్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి.

కాటమరాయుడు సినిమా ఎలా ఉందనే విషయం పక్కనపెడితే, అందులో శృతిహాసన్ మాత్రం అస్సలు బాగాలేదనే వాళ్లే ఎక్కువమంది. ఏవో 2-3 సన్నివేశాలు మినహాయిస్తే.. ఓవరాల్ గా శృతి గ్లామర్ మాత్రం గాడితప్పింది. మరీ ముఖ్యంగా తాజా చిత్రాలు శ్రీమంతుడు, ప్రేమమ్ లో కనిపించిన శృతిహాసన్ కు, కాటమరాయుడులో శృతిహాసన్ కు చాలా తేడా ఉంది. 

ఇప్పటికే గ్లామర్ తగ్గిందనుకుంటే, దానికి తోడు కాటమరాయుడులో శృతిహాసన్ కు ఇచ్చిన కాస్ట్యూమ్స్ ఆమెను మరింత డీగ్లామర్ చేశాయి. ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో శృతిహాసన్ వేసిన దుస్తులు, ఆ కలర్ కాంబినేషన్లు చిరాకు తెప్పించాయి. ఆమె అందంగా కనిపించలేదనడానికి ఆ దుస్తులు కూడా హెల్ప్ అయ్యాయి. 

ప్రస్తుతం టాలీవుడ్ లో లీడింగ్ హీరోయిన్లలో శృతిహాసన్ కూడా ఒకరు. త్రిష, అనుష్క, నయనతారలా ఏళ్లకు ఏళ్లు ఇండస్ట్రీలో పాతుకుపోలేదు. ఇప్పుడిప్పుడే ఒక్కో సినిమాతో క్రేజ్ తెచ్చుకుంటోంది. ఇలాంటి టైమ్ లో లుక్స్ పై విమర్శలు రావడం శృతి కెరీర్ కు మంచిది కాదు..

Show comments