జగపతి బాబు హీరోగా సినిమా

జగపతి బాబు..విలన్ గా టర్న్ అయిన హీరో. ఇప్పుడు విలన్ గానే దున్నేస్తున్నాడు. అయితే మళ్లీ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడట. నిర్మాత ఎవరో కాదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. మంచి సబ్జెక్ట్ దొరికిందని, దాన్ని తెలుగు, కన్నడ భాషల్లో జగపతిబాబు హీరోగా చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. 

నవంబర్ నుంచి ప్రారంభమయ్యే ఈ సినిమాకు సంబంధించి మిగిలిన విషయాలు అన్నీ డిస్కషన్ లో వున్నాయని, త్వరలో ఫైనల్ అవుతాయని అన్నారు. జగపతిబాబు మంచి నటుడు, కథానాయకుడు అని, అతనికి సరిపోయే పెర్ ఫెక్ట్ సబ్జెక్ట్ దొరికినందునే, సినిమా స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యామని ఆయన అన్నారు.

Show comments