బాబు మాట మోడీ చెవిన పడిందా.?

నరేంద్రమోడీ, ఈ రోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రాల మండలి సమావేశం సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, కేంద్రానికి వివిధ అంశాలపై తమ తమ అభిప్రాయాల్ని, తమ తమ అవసరాల్ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి విభజన సమస్యల పరిష్కారంపై కేంద్రానికి విజ్ఞప్తులు అందాయి. విభజన చట్టంలోని లోటుపాట్లను సవరించాలని చంద్రబాబు కోరితే, నీటి పంపకాల్లో కేంద్రం జోక్యం చేసుకోవాలని కేసీఆర్‌ కోరారు. ఇంకోపక్క, గవర్నర్‌ వ్యవస్థనే రద్దు చేసెయ్యాలనే ప్రతిపాదనలూ రాష్ట్రాల మండలి సమావేశంలో రావడం గమనార్హం. 

వివిధ రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని ప్రధాని నరేంద్రమోడీ సానుకూలంగా తెలుసుకున్నారట. దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే కేంద్రానికి రాష్ట్రాలు సహకరించాలని మోడీ మాస్టారు క్లాస్‌ తీసుకున్నంత పన్జేశారు. అంతే తప్ప, రాష్ట్రాల విజ్ఞప్తుల్ని పరిశీలించి, రాష్ట్రాల సమస్యల్ని పరిష్కరిస్తామన్న మాట మాత్రం నరేంద్రమోడీ నుంచి రాలేదు. మొదటి నుంచీ నరేంద్రమోడీ ఈ విషయంలో డిక్టేటర్‌లానే వ్యవహరిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాతోపాటు పలు అంశాలు విభజన నేపథ్యంలో హక్కుగా సంక్రమించాయనీ, ఆ విషయాల్లో కేంద్రం చిత్తశుద్ధిని ప్రదర్శించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రాల మండలి సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకురావడం ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఇప్పటిదాకా ఈ విషయంలో నరేంద్రమోడీపై చంద్రబాబు ఒత్తిడి తీసుకొచ్చిన దాఖలాల్లేవు. అయితే, చంద్రబాబు విజ్ఞప్తిని.. డిమాండ్‌ని నరేంద్రమోడీ పట్టించుకుంటారా.? అసలు ఆ విషయం మోడీ చెవిన పడిందా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

Readmore!
Show comments

Related Stories :